కాకతీయ రాజుల కళా వైభవాలకి ప్రతీక ఓరుగల్లు  

  • ఓరుగల్లు పేరు వినగానే మనకి కాకతీయ కాలం నాటి శిల్ప కళా వైభవాలు గుర్తొస్తాయి.కాకతీయులు వరంగల్ చుట్టూ పక్కల ఎన్నో రకాలైన కట్టడాలను నిర్మించారు.అలనాడు కట్టిన కాకతీయ చారిత్రక కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిలో వరంగల్ కోట , వేయి స్తంభాల గుడి,రామప్ప దేవాలయాలు ప్రముఖమైనవి.

  • #వేయి స్తంభాల గుడి:

  • వేయి స్తంభాల గుడి వరంగల్ జిల్లా హన్మకొండ లో ఉంది. తెలంగాణ రాష్ట్రం లోనే కాదు దేశంలోనే ప్రసిద్ధి పొందిన కట్టడం.ఈ గుడి ప్రాచీన వైభవాన్ని , అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చెదిరి పోకుండా ఉంది.ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే తెలియని ఒక అనుభూతి కలుగుతుంది.సోపానాలు మాదిరి ఉండే మెట్లు గోడలు అద్భుతంగా ఉంటాయి.ఇది చాలా పురాతనమైన దేవాలయం.వేయి స్తంభాల గుడిని 12 వ శతాబ్దం లో కాకతీయ రాజు రుద్ర దేవుడు నిర్మించాడు. ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితమైనదే కాదు ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది అదేంటంటే ఇక్కడ ఉండే స్తంభాల పై నాణాలతో గాని ఏదైనా ఇనుము లోహం తో గాని తాకిస్తే సప్త స్వరాలు , మధురమైన సంగీతం వినిపిస్తుంది.ఈ ఆలయం లో ఎటు వైపు చూసిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి , వరంగల్ వెళ్తే తప్పకుండా సందర్శించే ప్రదేశం ఇది.

  • #వరంగల్ ఖిల్లా: