ఆరు గంటల్లో సినిమా పూర్తి చేసిన శృతి హసన్  

Mosquito Philosophy first Tamil film to be shot in 6 hours, Tollywood, Krack Movie, Kollywood, Salaar Movie, shruti hassan - Telugu 6 Hours, Kollywood, Krack Movie, Mosquito Philosophy, Salaar Movie, Shruti Hassan, Tollywood

క్రాక్ సినిమాతో రెండేళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతి హసన్ మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమాలో ఓ వైపు రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా శృతి కుమ్మేసింది.

TeluguStop.com - Mosquito Philosophy First Tamil Film To Be Shot In 6 Hours

ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా శృతి హసన్ నటించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయింది.అయితే లస్ట్ స్టోరీస్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ టాక్ రాలేదు.

ప్రస్తుతం శృతి హసన్ ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ సలార్ లో ఫైనల్ అయిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది.

TeluguStop.com - ఆరు గంటల్లో సినిమా పూర్తి చేసిన శృతి హసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్ నడుస్తుంది.తెలుగుతో పాటు మాతృభాషపై కూడా శృతి హసన్ దృష్టిపెట్టి సినిమాలు చేస్తుంది.

అలాగే నటిగా తనని తాను ఎలివేట్ చేసుకునే విధంగా ఉన్న వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కూడా ఈ అమ్మడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.ఈ నేపధ్యంలో తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది.

లక్ష రూపాయిల బడ్జెట్ తో శృతి హసన్ నిర్మించిన ఈ షార్ట్ ఫిలిం జయప్రకాశ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందింది.ఇందులో దర్శకుడుతో పాటు శృతి హసన్ లీడ్ రోల్ లో నటించింది.

అయితే ఈ షార్ట్ ఫిలిం గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఉంది.కేవలం ఆరు గంటల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు.

చెన్నైలో జరగన్నున 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి దీనిని పంపించినట్లు తెలుస్తుంది.ఎలాంటి సంభాషణలు లేకుండా కంప్లీట్ కంటెంట్ ఎలివేషన్ తోనే ఈ షార్ట్ ఫిలిం ఉండబోతుందని తెలుస్తుంది.

#Kollywood #6 Hours #Shruti Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు