దారుణమైన సంఘటన : ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. మీరు జాగ్రత్త పడండి

మృత్యువు ఏ వైపు నుండి వస్తుందో ఎవరు ఊహించలేరు.ప్రతి జీవి ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే.

 Mosquito Coil Causes Fire Man Dies Narayan Peta-TeluguStop.com

అయితే అది జాగ్రత్తగా ఉండకుంటే త్వరగా వస్తుంది.ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే చావు అనేది ఆలస్యం అవుతుంది.

ఆ ఏముందిలే అనుకుంటే మాత్రం దారుణాలు జరుగుతాయని మరోసారి నారాయణపేటకు చెందిన వసంతరావు విషయంలో నిరూపితం అయ్యింది.దోమలను చంపేందుకు ఉపయోగించే మష్కిటో కాయిల్‌ అజాగ్రత్తతో ఉండటం వల్ల ఆయన ప్రాణాలను తీసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.నారాయణపేటలోని బ్రహ్మణవాడకు చెందిన వసంతరావు మరియు షాలిని దంపతులు ఒంటరిగా ఉంటున్నారు.వృద్యాప్యం వల్ల వసంతరావు మంచానికే పరిమితం అయ్యాడు.ఆయన మంచి నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

అనారోగ్యం కారణంగా కొన్ని వారాలుగా వసంతరావు మంచం మీద నుండి లేచి తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేక పోతున్నాడు.ఒక రోజు రాత్రి ఈ వృద్ద దంపతులు ఇంట్లో దోమలు మరీ ఎక్కువగా ఉండటంతో మష్కిటో కాయిల్‌ను వెలిగించారు.

వసంతరావు ఉన్న రూంలో కాకుండా షాలిని మరో చోట పడుకుంది.వసంతరావు పడుకున్న మంచంకు చాలా దగ్గరగా మష్కిటో కాయిల్స్‌ను షాలిని పెట్టింది.

ప్రతి రోజు కూడా అలాగే పెడుతుంది కాని ఈసారి మాత్రం ఆమె అలా పెట్టినందుకు బాధపడే సంఘటన జరిగింది.మష్కిటో కాయిల్‌ ఫ్యాన్‌ గాలికి మంట అంటుకుంది.ఆ మంట మొదట బెడ్‌ షీట్‌కు అంటుకుని, ఆ తర్వాత మంచంకు అంటుకుంది.మంట పెరుగుతున్నా కూడా వసంతరావు లేవలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఆయన అరిచాడు.

షాలిని వచ్చేప్పటికి జరగకూడనిది జరగి పోయింది.వసంత రావు మంటల్లో సజీవ దహనం అయ్యాడు.

ఈ దారుణం స్థానికంగా అందరితో కన్నీరు పెట్టించింది.వసంతరావు మరణంతో అయినా అంతా జాగ్రత్తగా ఉండండి.

మస్కిటో కాయిల్స్‌ను కాస్త దూరంగా పెట్టండి.వాటికి కాగితాలు మరియు ఇతరత్ర మంట అంటుకునే వస్తువులకు దూరంగా ఉంచండి.ముసలి వారికి పిల్లలకు అసలు మష్కిటో కాయిల్స్‌ పెట్టకుంటే బెటర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube