ఆస్కార్ మూవీతో మోసగాళ్లు పోలిక!  

Mosagallu Similar To Slumdog Millionnaire - Telugu Manchu Vishnu, Mosagallu, Slumdog Millionnaire, Telugu Movie News

మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 Mosagallu Similar To Slumdog Millionnaire

ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జి చిన్ డైరెక్ట్ చేస్తుండగా ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా భారత్‌లో జరిగిన ఓ ఐటీ స్కాం ఆధారంగా తెరకెక్కనుందని, ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆస్కార్ మూవీతో మోసగాళ్లు పోలిక-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాతో పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కూడా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండగా, ఈ సినిమాను కూడా ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కిస్తున్నారు.

ఇలా ఎందుకు చేస్తున్నారని మంచి విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.

తను సినిమా కథలు లేని సమయంలో హాలీవుడ్‌లో ఒక ప్రొడక్షన్ హౌజ్‌ను తెరిచాని, అందులో ఇద్దరు రైటర్స్‌ను పెట్టుకుని కథలు రాయించుకున్నాడని, ఆ కథను తొలుత ఇంగ్లీష్‌లోనే తెరకెక్కించాలని అనుకున్నాడట.

అయితే చిత్ర నిర్మాతలు ఈ సినిమాను తెలుగులోనూ తీయాలని చెప్పారట.ఆడియెన్స్‌ను మెప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట.

అందుకే ఈ సినిమాను కూడా ఇంగ్లీ్ష్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు