మోసగాళ్లను కొడుక్కి చూపిస్తున్న మంచు విష్ణు  

Manchu Vishnu Watches Mosagallu Rough Edit With Son, Manchu Vishnu, Mosagallu, Kajal Aggarwal, Tollywood News - Telugu Kajal Aggarwal, Manchu Vishnu, Mosagallu, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా హాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాలని విష్ణు రెడీ అవుతున్నాడు.

 Mosagallu Kajal Aggarwal Tollywood

భారత్‌లో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలాంటి అంశాలతో వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మోసగాళ్లను కొడుక్కి చూపిస్తున్న మంచు విష్ణు-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో మోసగాళ్లు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కాగా రఫ్‌గా ఎడిట్ చేసిన మోసగాళ్లు చిత్రాన్ని మంచు విష్ణు తన కొడుకు అవ్రామ్‌తో కలిసి చూస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది.

కొడుకుతో కలిసి తన సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుందంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, అందాల భామ కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జెఫ్రీ జి చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Kajal Aggarwal #Manchu Vishnu #Mosagallu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mosagallu Kajal Aggarwal Tollywood Related Telugu News,Photos/Pics,Images..