వామ్మో… అయోధ్య భూమి పూజ కోసం ఎన్ని లడ్డూలు ఆర్డర్ చేశారో తెలుసా…?  

ayodhya, bhoomi pooja , laddu, More Than One Lakh Laddoos Ordered Ayodhya Bhoomi Puja - Telugu Ayodhya, Ayodya, Bhoomi Pooja, Laddu, More Than One Lakh Laddoos Ordered Ayodhya Bhoomi Puja

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న అయోధ్య రామ మందిరం కోసం యావత్ భారతదేశ ప్రజలు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు.అయితే మరో ఐదురోజుల్లో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది.

 More Than One Lakh Laddoos Ayodhya Bhumi Pooja

ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం పనుల కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు.అయితే ఈ భూమి పూజ కోసం ఏర్పాట్లు కూడా వేగంగానే చేస్తున్నారు.

ఈ భూమి పూజ జరిగే రోజున టైం స్క్వేర్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జై శ్రీరాం అంటూ హిందీ, ఇంగ్లీషు బాషల్లో పౌరాణిక ప్రదర్శన నిర్వహించనున్నారు.అయితే మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ అయోధ్య రామ మందిరం శంకుస్థాపన జరుగనుంది.

వామ్మో… అయోధ్య భూమి పూజ కోసం ఎన్ని లడ్డూలు ఆర్డర్ చేశారో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ భూమి పూజ కోసంసుమారు 200 మంది వరకు అతిధులు పాల్గొననున్నారు.

ఎంతమంది పాల్గొన్న కానీ సామజిక దూరం అనేది పాటించడం తప్పనిసరి.ఈ కార్యక్రమాన్ని ఎంతో భారీగా ఏర్పాటు చేయనుంది.భూమి పూజ సందర్భంగా భారీ ఎత్తున లడ్డూలు కూడా తయారు చేయిస్తున్నారు.1.11 లక్షల లడ్డూలను భక్తుల కోసం సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ లడ్డులు రాందాస్ చావ్నీలో తయారీ అవుతున్నాయి.

ఈ లడ్డూలను ప్యాకెట్ రూపంలో కాకుండా ప్రత్యేక టిఫిన్ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు.వీటిని అయోధ్యతో పాటు వివిధ తీర్థయాత్రల్లో పంపిణీ చేయనున్నారు.

#Ayodhya #Laddu #Ayodya #Bhoomi Pooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

More Than One Lakh Laddoos Ayodhya Bhumi Pooja Related Telugu News,Photos/Pics,Images..