సంవత్సరానికి వందమంది సైనికులు ఆత్మహత్య.. కారణం?

More Than Half Of Soldiers Under Severe Stress

మన ప్రాణాలు కాపాడే సైనికులే.వాళ్ల ప్రాణాలను అర్పించడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకుంటున్నారు.

 More Than Half Of Soldiers Under Severe Stress-TeluguStop.com

మన దేశ రక్షణ కోసం దేశ సరిహద్దు న ఉంటూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మనల్ని కాపాడుతున్నారు.కానీ ఆ సైనికుల ను కాపాడే సైన్యం లేకుండా పోయింది.

ఇటీవలే పరిశీలించిన అధ్యయనం ప్రకారం దాదాపు 100 మంది సైనికులు ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం అందర్నీ భయాందోళనలకు గురి చేస్తుంది.

 More Than Half Of Soldiers Under Severe Stress-సంవత్సరానికి వందమంది సైనికులు ఆత్మహత్య.. కారణం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

థింక్ ట్యాంక్ యునైటెడ్ సర్వీస్ ఇన్ స్టి ట్యూషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన అధ్యయనం ప్రకారం భారత సైనికుల గురించి కొన్ని విషయాలు తెలిపారు.

ప్రతి ఒక్క సైనికుడు ఏదో ఒక కారణాలవల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు.దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సైనికులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

Telugu Severe Stress, Soldiers, Suicide, Survey-Telugu Health

భారత సైన్యం లో ప్రతి మూడో రోజుకు ఒక్కో జవాన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఏమి చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు‌.యూ ఎస్ ఐ సీనియర్ రిసెర్చ్ ఫెలో కర్నల్ ఏకే మోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క జవాన్ తమ జీవితం కాలం పాటు విరోధులు తో, ఉగ్రవాదులతో పోరాడుతూ ఉండటమే కాకుండా.ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి, అధిక రక్తపోటుకు సంబంధించి ఇతర సమస్యల వల్ల ఇలా పాల్పడుతున్నారని తెలిపారు.అంతేకాకుండా వాళ్ళకి తమ పై అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, వాళ్ళ ఆరోగ్య విషయం పట్టించుకోకపోవడంతో, అధికారుల నుంచి అవమానం ఎదురవడంతో, కుటుంబానికి సంబంధించిన విషయంలో, ఫోన్ వాడకంతో ఇలా ఎన్నో కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

దీనివల్ల వాటిని తట్టుకొనే శక్తి లేకపోవడంతో ఆత్మహత్యకు పాలవుతున్నారని పలు అధ్యయనంలో తెలిపారు.

#Severe Stress #Soldiers

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube