బ్రెజిల్ ను వణికిస్తున్న కరోనా, ఒక్క రోజులోనే 50 వేలకు పైగా

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.బ్రెజిల్ లో ఈ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

 More Than 50 Thousand Corona Cases Registered In Brazil In A Single Day ,brazil,-TeluguStop.com

ఎవరికీ అంతుపట్టని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో 54,771 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం మరింత కలకలం సృష్టిస్తుంది.

ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున బయటపడటంతో అంతా ఆందోళన చెందుతున్నారు.ఈ స్థాయిలో కేసుల సంఖ్య ఉంటే కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో ప్రజలు వైరస్ పేరు వినబడితేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది.అమెరికా తర్వాత ఈ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన స్థానంలో బ్రెజిల్ నిలిచింది.

ఇక్కడ ప్రతి రోజు ఎక్కువగానే పాజిటివ్ కేసులు వస్తున్నాయి.కానీ నిన్న మాత్రం 54 వేల మందికి సోకింది.

ఈ స్థాయిలో లక్షణాలు బయటపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.దీంతో దేశం మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 10,32,913కు పెరిగిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

నిన్న 1206 మంది మరణించడంతో 48,954కు చేరింది.అయితే అలానే అక్కడ రికవరీ రేట్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు 5,07,000 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు.మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube