మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు తో వాలంటీర్ల పై మరింత ఆంక్షలు ఎస్ఈసీ నిమ్మగడ్డ విధించడం జరిగింది.మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న క్రమంలో ప్రజలను మరియు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాలంటీర్ల వ్యవహారం ఉంటే చట్టరీత్యా నేరం చేసిన వారవుతారని .
శిక్షార్హులు అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొన్నారు.ఎవరైనా ప్రజలను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ తాజాగా వాలంటీర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికల కమిషన్ కాల్ సెంటర్ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.ఇదే రీతిలో ఓటర్లు ఎవరైనా వాలంటీర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అంటే వెంటనే ఫిర్యాదు చేయాలని.
ఈ క్రమంలో అలాంటి ఫిర్యాదులపై కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.పంచాయతీ ఎన్నికలలో చాలావరకూ గ్రామ వాలంటీర్ల వల్ల ఓటర్లు ప్రభావితం అయినట్లు ఆరోపణలు రావడంతో నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలలో అటువంటి పరిస్థితి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
.