ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి మరిన్ని లాక్ డౌన్ మినహాయింపులు.... ఇలా అయితే కష్టమే...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించి వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు, మినహాయింపులు చేపట్టారు.

 Lock Down, Andhra Pradesh, Corona Virus, Ap Transport-TeluguStop.com

ఇందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు లాక్ డౌన్ లో మినహాయింపులు చేపట్టింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కార్లు, ఆటోలు మరియు ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చింది.

కానీ ప్రజలు బయట ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలు, సలహాలు, సూచనలు వంటివి కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ లాక్ డౌన్ మినహాయింపులపై కొందరు ప్రజా సంఘ నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.

అంతేగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా రవాణా వ్యవస్థను తెరిస్తే ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తారని కాబట్టి మరోమారు ప్రజారవాణా వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

అలాగే కొంతమంది వైద్య నిపుణులు కూడా గత కొద్దిరోజులుగా లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు మరి కొంత కాలం పాటు రవాణా వ్యవస్థను నిలిపివేయాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3252 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో దాదాపు 2000 పైచిలుకు మంది విజయవంతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోగా, మరో 59 మంది ప్రాణాలను కోల్పోయారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube