అన్ని అనుకూలతలే: భారతీయుల చూపు ఐర్లాండ్‌ వైపు...  

More Indians, Including Diaspora, Heading To Ireland-indians,leprechauns,popular In Irish Folklore

గోబలైజేషన్, విద్య, ఉపాధి తదితర కారణాలతో భారతీయులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే , గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు.చివరికి యూకేలో స్థిరపడిన భారతీయులు సైతం ఐర్లాండ్ లో స్ధిరపడేందుకు మొగ్గుచూపుతున్నారు.ఐర్లాండ్‌లో స్థిరపడేందుకు యూరోపియన్ యూనియన్ ఎలాంటి ఆంక్షలు విధించదు.అలాగే ఐర్లాండ్ మరియు యూకే మధ్య కామన్ ట్రావెల్ ఏరియా అగ్రిమెంట్ కింద ఐరిష్ పౌరసత్వం ఉన్న వ్యక్తులు వీసా లేదా వర్క్ పర్మిట్ అవసరరం లేకుండా యూకేలో నివసించవచ్చు అలాగే పనిచేయవచ్చు.

More Indians, Including Diaspora, Heading To Ireland-indians,leprechauns,popular In Irish Folklore Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- V-More Indians Including Diaspora Heading To Ireland-Indians Leprechauns Popular In Irish Folklore

అలాగే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న అన్ని సభ్యదేశాలలో ఐరిష్ ప్రజలు సులభంగా ప్రవేశించవచ్చు.

More Indians, Including Diaspora, Heading To Ireland-indians,leprechauns,popular In Irish Folklore Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- V-More Indians Including Diaspora Heading To Ireland-Indians Leprechauns Popular In Irish Folklore

సాధారణంగా పని కోసం ఐర్లాండ్ వచ్చిన ప్రజలు ఐదేళ్లు ఇక్కడ ఉంటే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.2018లో 629 మంది భారతీయులకు పౌరసత్వం లభించింది.ఐర్లాండ్‌లో ప్రస్తుతం కార్మికుల కొరత స్పష్టంగా ఉంది.

అందుకే ఆ దేశానికి యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల పౌరులు అవసరం.ఈ కోవలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.2018లో ఐరీష్ ఇమ్మిగ్రేషన్ విభాగం కేటాయించిన వివిధ వీసాల్లో ఎక్కువమంది లబ్ధిదారులు భారతీయులే.మరోవైపు యూరోపియన్ యూనియేనేతర జాతీయులలో బ్రెజిలియన్ల తర్వాత భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు.

ఐర్లాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్నోవేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.2019తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో యూరోపియన్ యూనియేనేతర జాతీయులకు కేటాయించిన 14,014 మొత్తం వర్క్ పర్మిట్లలో మూడింట ఒక వంతు (4,664) భారతీయులే దక్కించుకున్నారు.1,424 పర్మిట్లతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది.యూరోపియన్ యూనియేతర జాతీయులకు వర్క్ పర్మిట్‌ను స్పాన్సర్ చేయడానికి ఐరిష్ వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులలో కనీసం 50 శాతం మంది యూరోపియనేతరులనే నియమించాల్సి ఉంటుంది.