ట్రంప్ చీటి చిరిగిపోయినట్టేనా...2024 ఎన్నికలకు అనర్హుడేనా...??

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2024 లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు అనర్హుడు అవుతాడా, రాజకీయాల్లో ఇక పోటీ చేసే అవకాశమే లేదా, రాజ ద్రోహం నేరంతో అమెరికా జైల్లో ఊచలు లెక్కించాల్సిందేనా అంటే అవుననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది క్యాపిటల్ హిల్ పై దాడి ఘటన.

 More Evidence Emerge Against Former President Donald Trump In Capitol Attack, Ca-TeluguStop.com

ఈ ఘటనకు కారకులు ట్రంప్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అయితే ట్రంప్ ఈ దాడికి ప్రధాన సూత్రదారుడు అనే విషయం సాక్ష్యాదారాలతో తెలిస్తే తప్ప ట్రంప్ పై ఎలాంటి చర్యలు చేపట్టడానికి లేదు.

దాంతో సుదీర్ఘమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం నియమించిన కమిటి ట్రంప్ ఈ దారుణానికి ప్రధాన కారకుడు అనే నిర్ధారణకు వచ్చింది.అంతేకాదు అందుకు తగ్గట్టుగా ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది.

ఘటన సమయంలో ట్రంప్ వద్ద ఉన్న అధికారులు ట్రంప్ ఈ దారుణానికి కారణమని వాంగ్మూలం ఇచ్చారట.ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన లిచ్ చెనీ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలను ధ్రువీకరించారు కూడా.

దాంతో ట్రంప్ చుట్టూ మరించ ఉచ్చు బిగిస్తునట్టుగా నిపుణులు అంటున్నారు.త్వరలో

Telugu Capitol Attack, Donald Trump, Joe Biden, Presidential, White-Telugu NRI

ఈ కేసుకు సంభందించి వాదోప వాదనలు జరగనున్నాయని ఈ సమయంలో ఎలాగైనా సరే ట్రంప్ ను దోషిగా కోర్టు ముందు నిలబెట్టాలి మరిన్ని సాక్ష్యాలను సిద్దం చేసుకుంటోంది కమిటి.ఇదిలాఉంటే వైట్ హౌస్ లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ సైతం ట్రంప్ మాయం చేసారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలపై కూడా కమిటి దృష్టి పెట్టింది.

ట్రంప్ కోర్టు ముందు దోషిగా నిలబడటం ఖాయమని అదే జరిగితే ట్రంప్ జైలుకు వెళ్ళడమే కాకుండా 2024 ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవడమే కాకుండా రాజద్రోహ ముద్ర పడుతుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube