జీవితం సాధారణ స్థితికి: మెల్‌బోర్న్‌లో మరిన్ని కోవిడ్ సడలింపులు.. జనం ఖుషీ..!!

కోవిడ్‌ను కట్టడి చేయాలంటే అందుబాటులో వున్న ఏకైక మార్గం ‘‘లాక్‌డౌన్ ’’.ప్రజలు కలుసుకునే మార్గాలను మూసివేయడం ద్వారా మహమ్మారులను నియంత్రించవచ్చన్న పాఠంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌నే అనుసరించాయి.అయితే అన్ని చోట్లా ఇది ఒకేలా లేదు.కొన్ని చోట్ల నెలా, రెండు నెలల పాటు లాక్‌డౌన్ వుంటే ఇంకొన్ని చోట్ల మరో నెల అదనంగా అమలైంది.

 life Back To Normal: More Covid-19 Curbs Eased In Melbourne, Covid 19, Australia-TeluguStop.com

కానీ ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌ మాత్రం 9 నెలల పాటు లాక్‌‌డౌన్‌లోనే మగ్గిపోయింది.ఆంక్షలు ఎత్తివేయాలని ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం మాత్రం కఠినంగానే వ్యవహరించింది.

ఈ నేపథ్యంలో వారి ఆశలు ఫలించి దాదాపు 262 రోజుల లాక్‌డౌన్ నుంచి మెల్‌బోర్న్ వాసులకు అక్టోబర్‌ చివరి వారంలో విముక్తి లభించిన సంగతి తెలిసిందే.దీంతో అక్టోబర్ 22 తెల్లవారుజాము నుంచి నగరంలోని పబ్‌లు, రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్‌లకు ప్రజలు పోటెత్తారు.

కోవిడ్ వెలుగు చూసిన 2020 మార్చి నుంచి నేటి వరకు ఆరు సార్లు మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్ విధించారు.ప్రపంచంలోని ఏ నగరానికైనా ఇదే అత్యధికం.

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌ 234 రోజుల లాక్‌డౌన్‌తో మెల్‌బోర్న్ తర్వాతి స్థానంలో నిలిచింది.

గడిచిన కొన్ని రోజులుగా నగరంలోని పబ్‌లు, కేఫ్‌లు భారీగా రద్దీని కలిగివున్నాయి.

మెల్‌బోర్న్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీగా చేస్తుండటంతో అధికారులు మరిన్ని ఆంక్షలను సడలించారు.ఇప్పుడు ఇక్కడ డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 70, 80, 90 శాతానికి చేరుకోవడంతో ఆంక్షలను సడలించడం ప్రారంభించారు.

విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ మీడియాతో మాట్లాడుతూ…ఇకపై మీ జీవితం సాధారణ స్థితికి వస్తుంది.అలాగే ఇప్పటివరకు కోల్పోయిన అన్ని సంతోషాలను తిరిగి పొందుతారని ఆండ్రూస్ ఆకాంక్షించారు.

Telugu Normalcovid, Australia, Australia Covid, Covid, Melbourne-Telugu NRI

కొత్త మార్గదర్శకాల ప్రకారం.ఇంటిలో సమావేశాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.అయితే ఆరోగ్య కేంద్రాలు, ప్రజారవాణ, రిటైల్ దుకాణాలలో మాస్క్‌లు మాత్రం తప్పనిసరి.అలాగే బాక్సింగ్ డే క్రికెట్ టెస్ట్ మ్యాచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్‌కు ప్రేక్షకులకు అనుమతి లభించవచ్చు.

సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా వంటి అతిపెద్ద నగరాలు డెల్టా వేరియంట్ కారణంగా నెలల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గిపోయాయి.వ్యాక్సినేషన్ వల్ల తిరిగి ఒక్కొక్కటిగా ఆంక్షల చట్టం నుంచి బయటపడుతున్నాయి.

డెల్టా వేరియంట్ వల్ల ఆస్ట్రేలియాలో దాదాపు 1,94,000 కేసులు… 1,922 మరణాలు సంభవించాయి.నిజానికి మిగిలిన దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కోవిడ్ బాధితుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు.కాగా.న్యూసౌత్‌వేల్స్‌లో గురువారం 262, విక్టోరియాలో 1,007 కొత్త కేసులు.ఆస్ట్రేలియన్ క్యాపిటల్ రీజియన్‌లో 25 కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube