ఏపీలోని ఆ జిల్లాను గజగజా వణికిస్తున్న కరోనా?  

More Corona Cases in East Godavari District, corona virus, covid-19 cases, ap districts,Corona Deaths - Telugu Ap Districts, Corona Deaths, Corona Virus, Covid-19 Cases, More Corona Cases In East Godavari District

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

TeluguStop.com - More Corona Virus Cases In Ap Districts

గతంతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.ముఖ్యంగా గోదావరి జిల్లాలను కరోనా గజగజా వణికిస్తోంది.

మొదట్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో మాత్రం వైరస్ తగ్గుముఖం పట్టడం గమనార్హం.

TeluguStop.com - ఏపీలోని ఆ జిల్లాను గజగజా వణికిస్తున్న కరోనా-General-Telugu-Telugu Tollywood Photo Image

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,00,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా ఈ కేసులలో 5,00,000కు పైగా రోగులు డిశ్చార్జి కావడం గమనార్హం.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,218 కేసులు నమోదయ్యాయి.మరోవైపు కరోనా మృతుల సంఖ్య సైతం క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.రాష్ట్రంలో ఒక దశలో 90కు పైగా కరోనా మరణాలు నమోదు కాగా గత 24 గంటల్లో 58 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

ఈ మధ్య కాలంలో ఇంత తక్కువగా కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,302 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.గత 24 గంటల్లో 10,820 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.అయితే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి విషమంగా ఉంది.ఇక్కడ ప్రతిరోజూ 1,000కు పైగా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 85,247 కేసులు నమోదు కాగా 481 మంది మృతి చెందారు.జిల్లాలో ప్రస్తుతం 12,292 కేసులు నమోదయ్యాయి.జగన్ సర్కార్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి వైరస్ ను అదుపు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే తమ కష్టాలు తీరతాయని అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం మాత్రం వ్యాక్సిన్ కోసం 2021 జనవరి వరకు ఎదురుచూపులు తప్పవని ప్రకటన చేసింది.

#MoreCorona #Covid-19 Cases #Ap Districts #Corona Virus #Corona Deaths

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

More Corona Virus Cases In Ap Districts Related Telugu News,Photos/Pics,Images..