51 ఏళ్ల హీరో, 25 ఏళ్ల హీరోయిన్ ఇతని గర్ల్ ఫ్రెండ్   More Clues About Aamir Khan – Fatima’s Affair     2017-10-23   02:16:40  IST  Raghu V

బాలివుడ్ మెగాస్టార్ ఆమీర్ ఖాన్ రీల్ లైఫ్ లో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్. అతని సినిమా జీవితంలో ఎప్పుడో 17 ఏళ్ళకి ముందు తగిలిన అరకొర ఫ్లాపులు ఉండొచ్చు కాని, అంతకుమించి కెరీర్ కి ఒక్క వంక పెట్టలేము. అత్యధిక ఇండస్ట్రీ హిట్స్, అత్యధిక సక్సెస్ రేట్, రికార్డులు ఫ్యాన్ ఫాలోవింగ్, వేల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, ఇలా మచ్చలేని కేరీర్ ఆమీర్ సొంతం. కాని వ్యక్తిగత జీవితంలో మన పెర్ఫెక్షనిస్ట్ అంత పెర్ఫెక్ట్ కాదేమో.

మొదటి భార్య రీనుతో ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయాడు ఆమీర్. ఆ తరువాత ఓ రెండేళ్ళు ఒంటరిగానే ఉన్న ఆమీర్, తన సినిమాలకే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కిరణ్ రావుతో ప్రేమలో పడి, ఆమెను పెళ్ళి చేసుకొని ఓ బాబుకి జన్మనిచ్చాడు. ఇప్పుడు చిక్కు ఏమిటంటే, ఆమీర్ మరోసారి విడాకులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలిసిందేగా, ఆమీర్ దంగల్ లో తన కూతురి పాత్ర పోషించిన ఫాతిమా సనా షేఖ్ తో తెగ క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలివుడ్ ఓ ఏడాదికాలంగా కోడై కూస్తోంది. ఆమీర్ ఫాతిమాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో తెరేకేక్కిస్తున్న తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ లో ప్రొడ్యూసర్ తో గొడవపడి ఫాతిమాకి అవకాశమిచ్చాడు. ఇక్కడితో ఈ వారాల వెల్లువ ఆగడం లేదు. ఆ సినిమా పూర్తయిన తరువాత ఆమీర్ భారత తొలి అంతరిక్ష ప్రయాణికుడు రాకేశ్ శర్మ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఫాతిమానే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడట అమీర్. ఇలా అన్ని సినిమాల్లో ఆ అమ్మాయికే అవకాశమిస్తే మరి ఎవరికైనా డౌట్ వస్తుంది.

సరే, అమ్మాయి మంచి నటి కాబట్టి అవకాశాలు ఇస్తున్నాడు అనుకుందాం. ఈమధ్య ఆమీర్ తో తోడుగా భార్య కిరణ్ కి బదులు ఫాతిమా పార్టీల్లో కనిపిస్తోంది అంట. ఇదేమి వింత బంధమో ఈ 51 ఏళ్ల అగ్రనటుడికి, 25 ఏళ్ల ఈ హైదరాబాది అమ్మాయికి.