బస్సులో ఎదురైన సంఘటన..! ఆవిడ గురించి అతను అడిగిన మాటలో నిజం ఉంది కదా.?

విజయనగరం వెళ్ళే బస్సు కోసం రోడ్డుమీద నిలబడ్డారు వాళ్ళిద్దరూ.చాలీచాలని పంచెకట్టులో మాసిన పైగుడ్డతో అతడు; చిరిగిన పాత చీరలో ఆవిడ.

 Moral Story On Men And Women Difference-TeluguStop.com

అంతలో బస్సు వచ్చింది.
ఇద్దరూ ఎక్కేశారు.కండెక్టరు వచ్చి టికెట్ కోసం డబ్బులు అడిగితే…
“బాబూ! విజయనగరానికి టిక్కెట్ ఎంత?”
అంటూ అడిగాడు.

“అయిదు రూపాయలు,
తొందరగా డబ్బులు తియ్”
అన్నాడు కండక్టర్.
సంచిలోంచి డబ్బులు తీస్తూ…
“మరి మా ఆడదానికెంత బాబూ?” అంటూ అడిగాడు

బస్సులో జనం అందరూ గొల్లున నవ్వారు.

“నీకో రేటు మీ ఆడదానికో రేటు వుండదయ్యా పది రూపాయలు తియ్”
అన్నాడు కండక్టర్ విసుగ్గా.

పది రూపాయలు తీసి కండెక్టర్
చేతిలో పెడుతూ , బస్సులోని జనం వంక తిరిగి “నవ్వకండి బాబులూ…నాకు తెలియక అడిగినాను…._ఎందుకంటే పొలంలో ఎవసాయ పనికి వెళ్ళి ఇద్దరం సమానంగానే వరి నాట్లు వేస్తాం, కానీ నాకు యాభై రూపాయలు ఇచ్చి మా _ఆడదానికి మాత్రం పాతిక రూపాయలే ఇస్తారు…!
ఇక్కడ కూడా అలాంటిది ఉంటదేమోని అడిగాను…బాబూ…!”
అన్నాడు అమాయకంగా.

వారు అన్నదాంట్లో నిజం ఉంది కదా బ్రదరు.ఆడవాళ్ళూ ఏ విషయంలోనూ తక్కువ కాదు అంటారు కానీ రోజు కూలి విషయంలో సమాంతరంగా పని చేసిన ఇద్దరికీ ఇచ్చే వేతనంలో భేదం ఎందుకు? ఓ సారి ఆలోచించండి ఇది కరెక్ట్ అంటారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube