ఉల్లి లొల్లి ఇంకా ఎంత కాలం అంటే ?

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల రేటు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.తీవ్రంగా కురిసిన వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి భారీగా తగ్గడంతో ధరలు ఈ విధంగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది.

 Mopidevi Venkataramana Onion-TeluguStop.com

కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇక విషయానికి వస్తే ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా మండిపోతున్నా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ తో రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.25 కే రైతు బజార్ల ద్వారా అందిస్తోంది.ఈరోజు క్యూ లైన్ లో నుంచుని ఓ వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం అందించే 25 రూపాయల ఉల్లి కోసం క్యూలైన్లలో జనాలు బారులు తీరుతున్నారు.

అయితే ఉల్లి ధరల పరిస్థితి దాదాపు నెల రోజుల పాటు ఈ విధంగానే ఉంటుందని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

తెలంగాణ రైతు బజార్లలో ఉల్లి ధర 45 ఉండగా ఏపీలో కేవలం 25 కి అందిస్తున్నామని ఆయన చెప్పారు.మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండటంతో ఉల్లిపాయలు మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి సబ్సిడీపై 25 కి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube