ఉల్లి లొల్లి ఇంకా ఎంత కాలం అంటే ?  

Mopidevi Venkataramana Talks Press Meet Over Onion Price-

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల రేటు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.తీవ్రంగా కురిసిన వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి భారీగా తగ్గడంతో ధరలు ఈ విధంగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది.

Mopidevi Venkataramana Talks Press Meet Over Onion Price- Telugu Viral News Mopidevi Venkataramana Talks Press Meet Over Onion Price--Mopidevi Venkataramana Talks Press Meet Over Onion Price-

కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇక విషయానికి వస్తే ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా మండిపోతున్నా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ తో రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.

25 కే రైతు బజార్ల ద్వారా అందిస్తోంది.ఈరోజు క్యూ లైన్ లో నుంచుని ఓ వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం అందించే 25 రూపాయల ఉల్లి కోసం క్యూలైన్లలో జనాలు బారులు తీరుతున్నారు.

అయితే ఉల్లి ధరల పరిస్థితి దాదాపు నెల రోజుల పాటు ఈ విధంగానే ఉంటుందని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

తెలంగాణ రైతు బజార్లలో ఉల్లి ధర 45 ఉండగా ఏపీలో కేవలం 25 కి అందిస్తున్నామని ఆయన చెప్పారు.మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండటంతో ఉల్లిపాయలు మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి సబ్సిడీపై 25 కి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

తాజా వార్తలు