మాకు హామీ ఏమీ లేదు, త్యాగంకు సిద్దమన్న మోపిదేవి

వైకాపా ప్రభుత్వం శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే అసెంబ్లీలో రద్దు కోసం తీర్మానం చేయడం జరిగింది.

 Mopidevi Jagan Chandrababu Naidu-TeluguStop.com

నేడు కాకున్నా రేపు అయినా అన్నట్లుగా మండలి రద్దు ఖాయం.ఇలాంటి సమయంలో మండలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి అవ్వడంతో పాటు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు.ఇక మోపిదేవి కీలక శాఖను నిర్వహిస్తున్నాడు.

మండలి రద్దు తర్వాత వీరిద్దరు కూడా మంత్రి పదవులు నిర్వహణకు అర్హులు కారు.అందుకే వీరిద్దరు మండలి రద్దుకు ముందే రాజీనామా చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే వీరిద్దరి మంత్రులకు జగన్‌ ఏదో హామీ ఇచ్చాడని, ఖచ్చితంగా వీరిద్దరికి భవిష్యత్తులో మంచి స్థానం కలిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అయితే మోపిదేవిమాట్లాడుతూ పార్టీ నుండి మాకు ఎలాంటి హామీ లేదు.

అయినా కూడా మేము పదవులను త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ మోపిదేవి చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube