చర్మ సమస్యలకు పెసరపిండి పేస్ పాక్స్  

Moong Dal For Skin-

పెసరపిండిని మన పూర్వీకుల కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ ఉన్నారు.పెసరపిండి చర్మంపై ఒక మ్యాజిక్ వలే పనిచేస్తుంది.మొటిమలు,మొటిమల మచ్చలు,జిడ్డుని ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.ఇప్పుడు చెప్పే పాక్స్ ఉపయోగిస్తే చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు.

వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

Moong Dal For Skin-

అరస్పూన్ పెసరపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత రబ్ చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖంపై ఫ్లాకీనెస్ తొలగిపోతుంది.

పెసలను ఉడికించాలి.ఒక స్పూన్ ఉడికించిన పెసలలో ఒక స్పూన్ తేనే వేసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద మొటిమలు మాయం అవుతాయి.

ఒక స్పూన్ పెసరపిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద టాక్సిన్స్ తొలగిపోతాయి.

అర స్పూన్ పెసరపిండిలో 2 స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద సన్ తాన్ తొలగిపోతుంది.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేయాలి.

తాజా వార్తలు