మీకు తెలుసా : పెసర పప్పుతో 15 నిమిషాల్లో జ్వరం పోగొట్టొచ్చు

మనిషి అన్నప్పుడు అనారోగ్యం బారిన పడటం చాలా కామన్‌.ముఖ్యంగా జ్వరం అనేది ఏడాదికి ఒక్కసారి అయినా వచ్చి పోతూ ఉంటుంది.

 Small Health Tip With Moong Dal For Reduce Body Heat When Suffering With Fever, Moong Dal, Moong Dal Health Tips-TeluguStop.com

కాని జ్వరంను అశ్రద్ద చేయడం వల్ల అది టైపాయిడ్‌ లేదా మలేరియాగా కూడా మారే అవకాశం ఉంటుంది.అందుకే జ్వరం వచ్చిన వెంటనే మెరుగైన చికిత్స తీసుకోవడం మంచిది.

జ్వరం అంటే శరీరం అంతా వేడి అవ్వడం.మామూలుగా కూడా మన శరీరంలో వేడి ఉంటుంది.

కాని కొన్ని సార్లు వైరస్‌ ఇతరత్ర కారణాల వల్ల శరీరంలో మార్పులు సంభవించి ఒల్లంతా ఒక్కసారిగా వేడి అవుతుంది.

  అలా శరీరం వేడి అయినప్పుడు నీరసంగా అనిపించడం, తమ శరీరం తమకే భారంగా అనిపించడం, నోట్లో కూడా వేడి ఉండటం వల్ల ఏదీ తినాలనిపించక పోవడం జరుగుతుంది.అలాంటి సమయంలో మన శరీరంను చల్లబర్చాలి.అలా చల్లబర్చిన తర్వాత ఏమైనా లైట్‌ ఫుడ్‌ను బలంకోసం తీసుకోవడం వల్ల జ్వరం నుండి దూరం అవ్వొచ్చు.

శరీరం చల్లబడేందుకు పెసర పప్పు అద్బుతంగా ఉపయోగపడుతుందని పెద్దలు అంటున్నారు.ఇది చిన్న చిట్కా అయినా కూడా చాలా బాగా పని చేస్తుందని వారు చెబుతున్నారు.

  పిల్లలు లేదా పెద్ద వారి వయసును బట్టి 100 గ్రాముల నుండి 200 గ్రాముల వయసు వరకు పెసరపప్పును తీసుకోవాలి.వయసు తక్కువ అయితే తక్కువ పప్పు తీసుకున్నా పర్వాలేదు.ఆ పప్పును ఒకసారి నీటిలో కడిగి ఎంతైతే పప్పు తీసుకున్నారో అంతే పరిమాణంలో నీటిని పోయాలి.20 నుండి 30 నిమిషాల వరకు పప్పును నాననివ్వాలి.ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి.ఆ నీటిని జ్వరంతో బాధపడుతున్న వారికి తాపించాలి.అలా తాపించడం వల్ల పావుగంటలో శరీరం నుండి వేడి తగ్గుతుంది.

  నిరసం అలాగే ఉంటుంది.దాంతో ఏదైనా లైట్‌ ఫుడ్‌ను వారికి తినిపించాలి.ఇలా చేయడం వల్ల జ్వరం చాలా స్పీడ్‌గా తగ్గుతుంది.

శరీరం వేడి తగ్గినా కూడా డాక్టర్‌ ఇచ్చిన మందులు కూడా వాడటం వల్ల మళ్లీ జ్వరం రాకుండా ఉంటుంది.

Small Health Tip With Moong Dal For Reduce Body Heat When Suffering With Fever, Moong Dal, Moong Dal Health Tips - Telugu Smalltip, Childrens, Tips, Helath Problems, Helath Tips, Moong Dal

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube