త్వరలో మూన్‌ టూరిజం..సిద్ధమా..!?

స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ‌ఇన్‌స్పిరేషన్‌ 4తో ప్రైవేటు అంతరిక్ష యానానికి మార్గం సుగమం చేస్తూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కూడా పలు అంతరిక్ష సంస్థలు రోదసి యాత్రను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

 Moon Tourism Soon .. Ready  Moon Tour, Latest News, Viral Latest, Social Media,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చంద్రునిపై మానవులను తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా సరికొత్త రోవర్‌ టెక్నాలజీతో సమగ్ర పరిశోధనలు ప్రారంభించింది.అలాగే మానవుడు చంద్రునిపై నివసించడానికి అనుకూలంగా ఉంటుందా పొలంలో పరిశోధనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుపుతుంది.

అవేంటో తెలుసుకుంటే.

చంద్రుని దక్షిణ ధృవంగా పిలచే పురాతన బిలంపైన మంచు జాడను కనిపెట్టేందుకు ఒక రోవర్‌ను 2023 కల్లా చంద్రునిపైకి ప్రవేశపెట్టనున్నట్లు నాసా సోమవారం వెల్లడించింది.

దక్షిణ ధృవం వద్ద రెండు భారీ ఖగోళ శకలాలు ఢీ కొనడంతో ఈ పురాతన బిలం ఏర్పడిందని నాసా ప్లానేటరీ డివిజన్‌ డైరక్టర్‌ లోరీ గ్లేజ్‌ తెలిపారు.సమస్త సౌరకుటుంబంలో పురాతన బిలం అత్యంత శీతల ప్రాంతమని.తన పరిశోధనలు చేయాల్సిన అవసరముందన్నారు.ఇందుకుగాను చంద్రుని ఉపరితలంపై సరికొత్త టెక్కాలజీ కల్గిన రోవర్‌ను ఉపయోగించి పరిశోధనలు చేస్తామన్నారు.

ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలంపై రంధ్రాలు చేసి దిగువ భాగన కూడా పరిశోధనలు చేసేందుకు మీరు కల్పిస్తుందన్నారు.

Telugu Latest, Moon Journey, Moon-Latest News - Telugu

ఈ రోవర్‌ చంద్రునిపై లభించే మంచు నీరును రాకెట్‌ ఇంధనంగా మార్చి అరుణ గ్రహంపైకి తీసుకెళ్ళడానికి సహాయ పడుతుందన్నారు.అంగారక గ్రహం భూమికి 1.3 సెకన్ల కాంతి దూరంలో ఉందన్నారు.ఈ రోవర్‌ను ధృవ అస్థిర స్వయం పరిశోధన రోవర్‌ లేదా వైపర్‌గా పిలుస్తామని తెలిపారు.50 గంటలపాటు సుదీర్ఘంగా పనిచేయగల బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని వివరించారు.ఎలాంటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకునేలా రోవర్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.సోలార్ ఎనర్జీ బ్యాటరీతో పనిచేసే ఇది సూర్యుడు ఎటువైపు ఉంటే ఆ వైపు సోలార్ బ్యాటరీ ప్యానెల్‌ని చేంజ్ చేసుకోగలదని వివరించారు.

కాగా ప్రస్తుతం నాసా పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube