అమెరికాలో రంగుమారిన చందమామ...అరిష్టమంటూ ఆందోళన...!!

అసలే కరోనా, అందులో థర్డ్ వేరియంట్ ఇంకేముంది, మొదటి వేవ్ దెబ్బకే బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన అమెరికన్స్ ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే అమెరికాలో మళ్ళీ మొదటి వేవ్ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 Moon Change Colours Orange In America-TeluguStop.com

ఇదే సమయంలో ముంచుకొస్తున్న అగ్ని ప్రమాదాలు, తుఫానులు అమెరికాను అల్లకల్లోలం చేస్తుంటే తాజాగా అమెరికాలో జరిగిన అరుదైన ఘట్టం అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది, ఆందోళన కలిగిస్తోంది.వివరాలలోకి వెళ్తే.

అగ్ర రాజ్యంలో చందమామ రంగు మార్చుకున్నాడు ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.అదేంటి చందమాన రంగు ఎలా మార్చుకుంటాడు తెల్లగా ఉండాల్సిన చంద్ర మామ అల ఎలా రంగు మారుస్తాడు అంటూ ఆలోచనలో పడ్డారు అమెరికా ప్రజలు.

 Moon Change Colours Orange In America-అమెరికాలో రంగుమారిన చందమామ…అరిష్టమంటూ ఆందోళన…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇలా చంద్రుడు రంగులు మారడం ఎప్పుడు చూడలేదని, చందమామ రంగులు మారడం అరిష్టానికి, తీవ్ర నష్టానికి సంకేతాలని ఎవరికీ తోచిన విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Telugu America, And Nevada, California, Color, Mentana, Moon, Moon Change Colours Orange In America, Orange, Oregon, Social Media-Telugu NRI

పౌర్ణమి రోజున తెల్లటి తెలుపులో మెరిసిపోవాల్సిన చందమామ ఒక్క సారిగా రంగు మారిపోవడం పైగా నారింజ రంగులోకి మారిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చాలా మంది ఇది చెడుకు సంకేతమని ఇలాంటివి ఉత్పన్నం అవకూడదని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ కంగారు పెట్టిస్తున్నారు.

దాంతో ఈ విషయంపై వివరణ ఇచ్చింది స్థానిక ప్రభుత్వం.చంద్రుడు తెల్లగా మారడానికి, అరిష్టానికి సంభంధం లేదని సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని తెలిపింది.అలాగే చంద్రుడు నారింజ రంగులోకి రావడానికి అసలు కారణం చెప్పింది.కాలిఫోర్నియా, ఒరెగాన్, మెంటానా, నెవాడా రాష్ట్రాలలో వేల ఎకరాలలో అటవీ భూమి అగ్నికి ఆహుతి అయ్యింది దాంతో ఈ పొగ ఆకాశం మొత్తం ఆవరించడంతో చంద్రుడు నారింజ రంగులోకి మారాడని వివరణ ఇచ్చింది.

#America #Mentana #Color #Oregon #California

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు