ఆ ముగ్గురి మూడ్ ఈ విధంగా ఉందా ?  

Mood Of Those Three Are Like This-elections,evm,jagan,janasena,mood,pawan Kalyan,political Updates,polling Booth,tdp,ycp

ఎట్టకేలకు ఏపీలో ఎన్నికల తంతు విజయవంతంగా ముగిసింది. ఈవీఎం లోపాలు, ఢిల్లీ లో ధర్నాలు, పోలింగ్ బూత్ ల దగ్గర గలాటా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యేలే ఎదురయినా పోలింగ్ ఘట్టం మాత్రం ముగిసిపోయింది. ఇక మే 23 వ తేదీన ఫలితాల కోసం ఎదురుచూడడమే మిగిలి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు , అభ్యర్ధుల జాతకాలు ఇవన్నీ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి..

ఆ ముగ్గురి మూడ్ ఈ విధంగా ఉందా ?-Mood Of Those Three Are Like This

పోలింగ్ అనంతరం పరిస్థితి చూస్తుంటే వైసీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అనేక సర్వేల్లోనూ వైసీపీ అధికారంలోకి వస్తున్నట్టు తేలింది. ఈ నేపధ్యం లో మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల అధినేతల ఆంతర్యం ఏవిధంగా ఉంది అనే సందేహాలు అందరిలోనూ కలుగుతోంది.

వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ తీవ్రంగా శ్రమించాడు. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు జగన్ తీవ్రం కష్టపడ్డారు. అధికారం కోసం ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కష్టపడనంత స్థాయిలో జగన్ కష్టపడ్డాడు అనే సానుభూతి ప్రజల్లోనూ వ్యక్తం అయ్యింది.

ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురయినా జగన్ మాత్రం పాదయాత్ర కంప్లీట్ చేసాడు. ఎన్నికల నోటిఫి కేషన్ వచ్చిన తర్వాత కూడా జగన్ ప్రజల మధ్యనే ఉన్నారు. నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారంలోనూ కష్టపడ్డారు.

ప్రచార పర్వం ముగిసే వరకూ ఎండలను సైతం లెక్కచేయకుండా జగన్ కష్టపడ్డారు.

టీడీపీ అదినేత చంద్రబాబు విషయానికి వస్తే ఆయనలో కోపం, కసి బాగా పెరిగినట్టుగా కనిపిస్తోంది. జగన్‌, ఈసీ, సీఎస్ ఇలా ముగ్గురు మీద బాబు ఒంటికాలి మీద లేస్తున్నాడు. పోలింగ్ పూర్తి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎంత అసహనంతో ఊగిపోతున్నాడు.

ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలోనే కాక, జాతీయ స్థాయిలోను ఈసీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. బాబు ముఖం లో కనిపిస్తున్న ఈ భయం టీడీపీ ఓటమిని ముందే అందరికి తెలియజేస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పూర్తి నిరాశలో ఉన్నాడు..

పోలింగ్ కు ముందు ఆవేశంతో ఊగిపోయిన పవన్ పోలింగ్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. పవన్ ప్రస్తుతం హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.