కెనడా : కల నెరవేరిన రోజే ఘోర రోడ్డు ప్రమాదం... ఐసీయూలో పంజాబీ యువతి

Month After Moving To Canada Jalandhar Girl Lands In Icu

విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడాలనే కల కోసం ఎంతగానో శ్రమించిన ఓ యువతి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.కానీ విధికి కన్నుకట్టి.

 Month After Moving To Canada Jalandhar Girl Lands In Icu-TeluguStop.com

ఆమెను దేశం కానీ దేశంలో మంచం మీద చావు బతుకుల మధ్యన పడేసింది.వివరాల్లోకి వెళితే… దాదాపు రెండు నెలల క్రితం కెనడాకు వచ్చిన 23 ఏళ్ల కనికా అనే పంజాబీ యువతి.

టొరంటోలో అడుగుపెట్టిన ఐదు వారాలకే రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

 Month After Moving To Canada Jalandhar Girl Lands In Icu-కెనడా : కల నెరవేరిన రోజే ఘోర రోడ్డు ప్రమాదం… ఐసీయూలో పంజాబీ యువతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనికా ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటికే వైద్యులు రెండు బ్రెయిన్ సర్జరీలు నిర్వహించారు.కోలుకున్నప్పటికీ ఆమె ఎడమవైపు శరీర భాగం పక్షవాతానికి గురవ్వడంతో పాటు చికిత్సకు నెలలు పట్టవచ్చని వైద్యులు తెలిపారు.

కనికా తల్లి అంజు ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుండగా.ఆమె తండ్రి పరమ్‌జిత్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగంలో వున్నారు.

నవంబర్ 5న ప్రమాదం జరిగిన నాటి నుంచి కనికా తల్లిదండ్రులు .జలంధర్‌లోని వీసా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే వున్నారు.ప్రస్తుతం కెనడాకు విపరీతమైన రద్దీ వుండటంతో విమాన టికెట్లు కూడా పొందడం వీరికి కష్టంగా మారింది.అయితే ఎట్టకేలకు వారు కెనడా విమానం ఎక్కినట్లుగా తెలుస్తోంది.

కనికా ఈ ఏడాది ఏప్రిల్‌లో చదువును పూర్తి చేసుకుందని.అనంతరం విదేశాలలో కెరీర్ కొనసాగించాలన్న ఆమె లక్ష్యం కోసం తల్లిదండ్రులు అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని ఉపయోగించారని ఆమె బంధువొకరు మీడియాకు తెలిపారు.

అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్, కెనడా టికెట్లు, ఇతర ఖర్చుల కోసం రుణాలు సైతం తీసుకున్నారని వారు చెప్పారు.కెనడాలో అడుగుపెట్టి.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజే కనికా ప్రమాదానికి గురైందన్న వార్తతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు ఆమె మామయ్య హెచ్ఎస్ గిల్ ఆవేదన వ్యక్తం చేశారు.కెనడాలో వున్న కనికా స్నేహితులు ఈ క్లిష్ట పరిస్ధితుల్లో అండగా నిలిచారని.

ఫండ్ రైజింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారని గిల్ తెలిపారు.ఆమె స్వయంగా ఫిజియోథెరపిస్ట్ అయినప్పటికీ.

కోలుకోవాలంటే నిపుణుల పర్యవేక్షణలో వుండాల్సిందేనని ఆయన చెప్పారు .స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం తన పరిస్ధితిని చూసి కనికా తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని గిల్ తెలిపారు.

#Jalandhar #Canada #Paramjit Singh #Jalandhar ICU #Punjabi Young

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube