ఇవి మామూలు కోతులు కాదు ప్రాణాలే తీసేశాయి !     2018-10-20   14:58:18  IST  Sai Mallula

కోతుల అల్లరికి అంతే ఉండదు. అవి చేసే చేష్టలు అందరికి నవ్వు తెప్పిస్తుంటాయి. చెట్ల కొమ్మల మీద గెంతుతూ అందరికి వినోదం పంచె ఈ కోతులు ఏకంగా ఒక నిండు ప్రాణం బలితీసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్లోని బాఫ్పాట్లో జరిగింది. ధరమ్పాల్ సింగ్ (72) అనే వృద్ధుడిని కోతులు పొట్టనబెట్టుకున్నాయి.

Monkeys Who Have Been Killed By Oldman At Uttarapradesh-

Monkeys Who Have Been Killed By Oldman At Uttarapradesh

శనివారం ఉదయం వంట చెరకు కోసం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన సింగ్..పుల్లలు ఏరుతుండగా అక్కడే ఓ పాడుబడ్డ బంగ్లాలో పదుల సంఖ్యలో ఉన్న కోతులు వృద్ధునిపై రాళ్ళను విసిరాయి. దీంతో తల, ఛాతి భాగంలో గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిన సింగ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో కోతులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.