న‌గ‌రాల బాట ప‌ట్టిన కోతులు.. వీటితో కష్టాలు వర్ణనాతీతం అంటున్న ప్రజలు.. !

అడవిలో ఉండవలసిన జంతువులు జనంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈ మధ్య కాలంలో మనుషులకు బాగా అర్ధం అవుతుంది.అయితే ఇప్పటి వరకు కౄరమృగాలు, పాములు మాత్రమే మనుషులను భయపెట్టేవి.

 Monkeys On The Way To The City Monkeys, On The Way, City, Indescribable, Diffic-TeluguStop.com

కానీ తాజాగా వానర సైన్యం కూడా ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నాయి.మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో నిత్యం చూస్తూనే ఉన్నాం.

కానీ కోతులకు గానీ చిర్రెత్తిందంటే.ఇంటిపై పెంకులు, డిష్‌ వైర్లు ఇంట్లోని వంట సామగ్రి ధ్వంసం చేస్తు ఏకంగా మనుషులపై దాడులకు కూడా దిగుతున్నాయట.

ఇక ఈ వానరాలు నగరంలోకి కూడా ప్రవేశించాయి.ప‌ట్ట‌ణాల్లోకి గుంపులు గుంపులుగా వ‌స్తు నానా రచ్చ చేస్తున్నాయి.చేతిలో ఏం ఉంటే అది దాడి చేసి తీసుకెళుతున్నాయి.క‌నీసం రోడ్ల మీద కూర‌గాయ‌లు అమ్ముకోకుండా చేస్తున్నాయి.

కాగా తాజాగా హైద‌ర‌బాద్ లోని పారిశ్రామిక వాడ‌ల్లో ప్రవేశించిన కోతులు నానా హంగామ చేస్తు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయట.ఇక తెలంగాణ‌లో మాత్ర‌మే కాదు ఆంధ్రా‌లోను కోతుల బెడ‌ద ప‌డ‌లేక అధికారుల‌ను ఆశ్ర‌యిస్తున్న వారు లేక‌పోలేదు.

అయితే ఇన్నాళ్లు గ్రామాలు, ప‌ల్లెటూర్ల‌కే ప‌రిమితం అయిన కోతులు న‌గ‌రాల బాట ప‌ట్టడం కొంత ఆలోచించవలసిన విషయమేనట.పెద్ద సార్లు ఈ కోతుల ముట్తడిని త్వరగా కట్టడి చేయకుంటే మాత్రం నగర జీవికి కొత్త కష్టాలు రావడం ఖాయం.

ఆ పనేదో త్వరగా చేయండని అంటున్నారట కోతులతో ఇబ్బంది పడేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube