విషాదం : 12 రోజుల 'బాబు' ని కోతి ఎత్తుకెళ్ళి ....?  

  • ఆగ్రాలో కొద్ది రోజులుగా కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అనాలని చేస్తూనే ఉన్నారు. ఈ విషయం పై అధికారులకు ఎన్ని ఫిర్యాదు లు చేసినా పట్టీనుచోవడం లేదని చెబుతూనే ఉన్నారు. ఈ గొడవ ఇలా ఉండగానే… తాజాగా… ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరగరాని ఘోరం జరిగిపోయింది. 12 రోజుల పసివాడిపై వానరం దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రాణాలు విడిచాడు.

  • Monkey Snatches And Kills 12 Day Old Baby At Agra-

    Monkey Snatches And Kills 12 Day Old Baby At Agra

  • ఆగ్రాకు చెందిన యోగేష్, నేహా భార్యాభర్తలు. ఆటో డ్రైవరైన యోగేష్ సోమవారం బయటకు వెళ్లాడు నేహా తన 12 రోజుల పసిబిడ్డతో ఇంట్లోనే ఉంది. అయితే సాయంత్రం తల్లి పసివాడికి పాలిస్తున్న సమయంలో ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా నేహాపైకి దూకి దాడి చేసింది. దీంతో షాక్ తిన్న ఆమె కోతిని తరిమే ప్రయత్నం చేసింది. ఈలోపే వానరం ఒక్కసారిగా దూకి మంచంపై ఉన్న పసికందు మెడను పట్టుకొని ఈడ్చుకెళ్లింది. వెంటనే నేహా పెద్దగా కేకలు వేస్తూ స్థానికుల్ని పిలిచింది. అందరూ కలిసి వానరం వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత కోతి బాలుడిని పక్కింటిపై వదిలేసి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన పసివాడినికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.