వైరల్: టీడీపీలో చేరిన కొండముచ్చు.. వైకాపా పోస్టర్లను పీకిపారేసింది!  

Monkey Removes Jagan Flexi Video Goes Viral-monkey,pedapudi Monkey Video,viral Video

రాజకీయ నేతలు ఎప్పుడెప్పుడు ప్రత్యర్ధులపై రాళ్లు విసురుదామా అని ఎదురుచూస్తుంటారు.కేవలం రాజకీయంగానే కాకుండా వారికి సంబంధించి ఎలాంటి విషయం తెలిసినా ఎదుటివారిని ఆడుకోవడం రాజకీయ నేతలకు వెన్నెతో పెట్టిన విద్య.

Monkey Removes Jagan Flexi Video Goes Viral-Monkey Pedapudi Viral

అయితే తాజాగో మనుష్యులే కాకుండా ఓ కొండముచ్చు చేసిన పనికి కూడా ఏకంగా ఏపీ సీఎం జగన్‌ను ప్రతిపక్ష నేతలు ఏసుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపూడి గ్రామ సచివాలయ భవనానికి ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీ ఒకటి కట్టారు స్థానిక వైకాపా నేతలు.

అయితే ఆ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు ఆ ఫ్లెక్సీని పీకి పారేసేందుకు నానా తంటాలు పడింది.ఈ క్రమంలో ఎన్నిసార్లు కిందపడ్డా లేచి మళ్లీ ఆ ఫ్లెక్సీని అక్కడి నుండి పీకీపారేసే వరకు ఊరుకోలేదు.

ఇదంతా చూస్తున్న స్థానికులు తమ సెల్‌ఫోన్‌లకు పనిచెప్పారు.కొండముచ్చు చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.

ఇంకేముంది, ప్రతిపక్ష నేతలకు ఫ్రీ స్టఫ్ దొరికింది.ఏపీ సీఎం జగన్ పాలన ప్రజలకే కాదు జంతువులకు కూడా నచ్చడం లేదని వారు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు వదులుతున్నారు.

ఏదేమైనా కొండముచ్చు చేసిన పనికి వైకాపా నేతలు మండిపడుతున్నారు.కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

తాజా వార్తలు

Monkey Removes Jagan Flexi Video Goes Viral-monkey,pedapudi Monkey Video,viral Video Related....