కోతిపిల్ల చట్టం.. దెబ్బకు పదివేల జరిమానా

పెంపుడు కోతిపిల్లకు గొలుసులు వేయడంతో దాని యజమానికి భారీ జరిమానా పడిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు తమ కొడుకుతో కలిసి మల్లాపూర్‌లో నివాసముంటున్నారు.

 Monkey Owner Gets Penalty For Tying With Chains-TeluguStop.com

గాడిద పాలు అమ్ముకుంటూ వారి జీవనం సాగిస్తున్నారు.

కాగా తన కొడుకు ఓ కోతిపిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తుంటాడు.

ఈ క్రమంలో దానిని గొలుసులతో కట్టి హింసిస్తున్నాడని కంపాశనేట్ సొసైటీ ఫర్ అనిమల్స్ ఫౌండర్, చైర్పర్సన్ నాగారం ప్రవళిక అతడిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.దీంతో పోలీసులు ఆ బాలుడి తల్లదండ్రులను కూడా స్టేషన్‌కు రప్పించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.అంతేగాక కోతిపిల్లను గొలుసులతో బంధించినందుకు రూ.10వేల జరిమానా విధించారు.

అటవీ శాఖ అధికారులు ఆ కోతిపిల్లను స్వాధీనం చేసుకుని చెంగిచెర్ల అటవీ ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.మూగజీవాలను హింసిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube