మ్యాజిక్ చూసి తనలో తానే మురిసిపోతున్న కోతి..!

సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు గురించి అయితే చెప్పనవసరం లేదు.

 Monkey Expressions On Seeing Magic Going Viral On Social Media Details, Monkey,-TeluguStop.com

కొన్ని కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉంటే మరి కొన్ని మాత్రం చూడడానికి భయంకరంగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక కోతికి  సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ వీడియోలో కోతి చేసిన పని ఏంటో తెలుసు కుందామా.మీ అందరికి మ్యాజిక్ గురించి తెలిసే ఉంటుంది.

పిల్లల దగ్గర నుండి పెద్దవారి దాక మ్యాజిక్ అంటే ఇష్టపడతారు.వాళ్ళు చేసే గారడీ చూసి ఎదుటి వాళ్ళు అవాక్ అవుతారు.

అటు వంటి మ్యాజిక్ లను చూసే కొద్ది చూడాలని పిస్తుంది.చిన్న పిల్లలు అయితే ఆ మ్యాజిక్ చూసి తెగ సంబరపడిపోయి చప్పట్ల మీద చప్పట్లు  కొట్టేస్తారు.

అయితే ఇప్పుడు ఈ మ్యాజిక్ మనుషులనే కాకుండా ఒక ఓ కోతిని కుడా అలరించింది.ఆ వ్యక్తి చేసిన మ్యాజిక్ ట్రిక్ కోతికి కూడా బాగా నచ్చేసింది.

అతను చేసిన మ్యాజిక్ చూసి ఆ కోతి రకరకాల రియాక్షన్ పెట్టింది.ఒకటే గెంతులు వేస్తూ అక్కడ తెగ హంగామా చేసేసింది అనుకోండి.

ప్రస్తుతం ఆ కోతి పెట్టిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ చిత్రమైన ఘటన మెక్సికోలోని ఓ జూలో జరిగింది.అక్కడ జూకు వెళ్లిన ఓ సందర్శకుడు జూలో ఉన్న ఒక కోతి ముందుకు వెళ్లి ఒక మ్యాజిక్ ట్రిక్ చేశాడు.అతడు చేసిన ఆ మ్యాజిక్ ట్రిక్ చూసిన కోతి షాక్ అయ్యి ఒక లెవెల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది.

అచ్చం మనుషుల్లా గానే ముఖం లోని హావ భావాలు మార్చేసింది.ఆ కోతి పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఎవరయినా సరే కడుపుబ్బా నవ్వాలిసిందే.నెటిజన్లు కోతి చేసినా ఈ హంగామా చూసి భలే ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube