ఆఫీస్ పనులు ఒకరు కాకపోతే మరొకరు చేస్తారు.కానీ ఇంట్లో ఇల్లాలి పనులు చెయ్యడానికి ఎవరు ముందుకు రారు.
ఇంట్లో ఇల్లాలు అన్ని పనులు సక్రమంగా చేస్తేనే భర్త అయినా.పిల్లలు అయినా ప్రశాంతంగా ఉంటారు.
కానీ ఆ ఇల్లాలికి చిన్న పని కూడా ఎవరు చెయ్యరు.సమయానికి మాత్రం అన్ని కావాలంటారు.
సరేలే కనీసం ఒక పని మనిషిని అయినా పెట్టుకుందాం అంటే వారు దొరకడమే గగనం.దొరికిన జీతం ఎక్కువ పని తక్కువ.రెండు రోజులు చేస్తే మూడు రోజులు సెలువు పెడుతారు.సరేలే ఎలాగోలా అని అనుకుంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఏ పని ఆవిడని ఇంట్లోకి పిలవలేని దుస్థితి.
ఇంకా ఈ సమయంలోనే ఓ కోతి ఆ ఇంటి ఇల్లాలికి సహాయం చేయాలనుకుంది.
ఇంకేముంది.
అంట్లు ఉన్న సింకులోకి దిగి ట్యాప్ ఆన్ చేసి డిష్ వాష్ తో ఓ రేంజ్ లో అంట్లు తోముతుంది.కామెడీ అనుకునేరు.
నిజంగానే ఓ కోతి అంట్లు తోముతుంది.ఇది అంత వీడియో తీసి చాందిని అనే ఓ జంతు ప్రేమికురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోను ఆమె షేర్ చేస్తూ.నాకు కొత్త హెల్పర్ అంటూ ఆమె షేర్ చేసారు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మిడిల్ వైరల్ అవుతుంది.