ఈ కోతి ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…!  

Monkey delights after taking Gift From Owner, Gifts, Monkey, Owner - Telugu Delight, Gift, Gifts, Monkey, Monkey Delights After Taking Gift From Owner, Monkeys, Owner

సాధారణంగా చిన్నపిల్లలు అల్లరి చేస్తే కోతిలా ప్రవర్తించవద్దని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు.ఎందుకంటే కోతులు చేసే అల్లరి పనులు అన్నీఇన్నీ కావు.

TeluguStop.com - Monkey Delights Receiving Gift Owner

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కొన్ని పనుల్లో మనిషికి, కోతికి మధ్య సారూప్యత ఉంటుంది.కొన్ని పనులను మనుషులు ఏ విధంగా చేస్తారో కోతులు సైతం అదే విధంగా చేస్తాయి.

TeluguStop.com - ఈ కోతి ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…-General-Telugu-Telugu Tollywood Photo Image

కోతి నుంచే మనిషి పుట్టాడనే వాదన సైతం ఉంది.అయితే తాజాగా ఒక కోతి చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఒక యజమాని ఒక కోతిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు.ఆ కోతికి జార్జ్ అనే పేరు పెట్టుకున్నాడు.తానెంతో ఇష్టపడే ఆ కోతికి సరదాగా బహుమతులు ఇస్తూ ఉండేవాడు.యజమాని ఏవైనా బహుమతులు ఇస్తే కోతి తెగ మురిసిపోయేది.

ఆ కోతి బహుమతులు ఇస్తే సంతోషపడుతూ ఉండటంతో యజమాని కొత్తకొత్త బహుమతులు ఇస్తూ కోతి మరింతగా ఆనందించేలా చేసేవాడు.ఎప్పట్లాగే యజమాని కోతికి ఒక థర్మాస్ ను బహుమతిగా ఇచ్చాడు.

ఆ బహుమతిని అందుకున్న మర్కటం కళ్లల్లో ఆనందం అంతాఇంతా కాదు.అనంతరం కోతి మనిషి ఏ విధంగా గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేస్తాడో అదే విధంగా ఓపెన్ చేసింది.

అనంతరం బాక్స్ లోని మాన్యువల్ ను పరిశీలించి థర్మాస్ ను ఓపెన్ చేసి మళ్లీ ఏం సందేహం వచ్చిందో ఏమో మరోసారి మాన్యువల్ ను పరిశీలించింది.ఆ తరువాత థర్మాస్ మూతను తీస్తూ పెడుతూ మనిషిలా ప్రవర్తించింది.

యజమాని జార్జ్ చేసిన పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లు మనిషిలా ప్రవర్తిస్తున్న జార్జ్ తెలివిని ప్రశంసిస్తున్నారు.

#Delight #MOnkeys #Monkey #Owner #MonkeyDelights

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monkey Delights Receiving Gift Owner Related Telugu News,Photos/Pics,Images..