వీడియో : చావు ఇంటికి వెళ్లి బంధువులను ఓదార్చుతున్న కోతి... ఆ తర్వాతే అంత్యక్రియలు  

Monkey Consoles Woman At Karnataka-moneky Video,monkey,అంత్యక్రియలు,కోతి

మనుషుల మాదిరిగానే కోతులు కూడా వ్యవహరిస్తాయి. కొన్ని సార్లు మనిషి కూడా కోతిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కోతి నుండి మనిషి వచ్చాడు అనేందుకు ఇదే నిదర్శణంగా చెప్పుకోవచ్చు..

వీడియో : చావు ఇంటికి వెళ్లి బంధువులను ఓదార్చుతున్న కోతి... ఆ తర్వాతే అంత్యక్రియలు-Monkey Consoles Woman At Karnataka

అక్కడక్కడ కోతులు దేవుడిని పూజించడం, కోతులు పిల్లలను ఆడించడం చేస్తూ ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే కోతులు మనుషుల నుండి వచ్చాయి అనేందుకు మరో చక్కనైన ఉదాహరణ ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా కర్ణాటకలోని ఒక కోతి స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ కోతి ఎక్కడ ఎవరైనా చనిపోయినా కూడా వెంటనే అక్కడకు వెళ్తుంది. అక్కడ ఏడుస్తున్న వారిని ఓదార్చి వారి తలపై నిమిరుతుంది. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతుంది.

తాజాగా కూడా మరోసారి ఇలా జరిగింది. 80 ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా శోకంలో మునిగి పోయారు. ఆ సమయంలోనే అక్కడకు ఒక కోతి వచ్చింది. ఆ కోతిని చూసి ఎవరు కూడా అవాక్కవలేదు..

ఎందుకంటే ఆ కోతి స్థానికంగా అందరికి పరిచయమే. ప్రతి ఒక్కరి ఇంటికి ఆ కోతి వెళ్తుంది.

ఎక్కడ ఏడుపు వినిపించినా కూడా ఇదే విధంగా ఈ కోతి చేస్తుందట. పెద్ద ఎత్తున ఈ కోతి గురించి చర్చ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ కోతిని కింద వీడియోలో చూడవచ్చు.