జాతి వైరం మరిచి పందులతో కలిసి జీవిస్తున్న కోతి పిల్ల ...!

ఈ మధ్య ప్రపంచంలో చాలామంది మనుషులు వావివరసలు మానేసి ఇష్టానుసారంగా జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని మూగజీవాలు మానవాళికి సిగ్గు పడే లాగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.వివిధ జాతులకు సంబంధించిన జంతువులు వేరే జాతికి చెందిన ప్రాణులతో జీవనం కొనసాగిస్తూ మానవాళికి గుణపాఠం చెబుతున్నాయి.

 Pigs, Monkey Children, Animals,komaram Bheem, Kagaj Nagar-TeluguStop.com

అసలు విషయంలోకి వెళ్తే…

అసలు ఓ కోతిపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ… పందులతో కలిసి పోయి జీవనం కొనసాగిస్తోంది.ఓ తల్లి పంది దగ్గర ఆడుకుంటున్న పంది పిల్లతో జత చేరి వారితోనే కలిసి జీవనం కొనసాగిస్తుంది కోతిపిల్ల.

మామూలుగా తన సొంత తల్లి దగ్గర ఎలా ఆడుకుంటుందో కోతిపిల్ల అలాగే తల్లి పంది దగ్గర కూడా అలాగే ఆడుకుంటోంది.పూర్తిగా అలా ఆడుకుంటూ వారితో కలిసి జీవిస్తోంది.

ఇకపోతే అన్నీ తెలిసిన మనిషి ఎలా మసలుకోవాలో తెలిసిన కూడా, రోజు రోజుకి వారి సంబంధాలను దూరం చేసుకుంటూ ఉన్న సమయంలో మూగజీవాలు ఇలా జాతి వైరాన్ని మరచి కలిసి పోవడం నిజంగా గొప్ప విషయమే.ఇకపోతే ఈ ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మారుతి నగర్ లో చోటు చేసుకుంది.

అక్కడ ఉన్న ఓ ఇంటి కాళీ స్థలంలో ఓ పంది తన పిల్లలతో వచ్చి మకాం వేసింది.

ఇకపోతే అప్పుడప్పుడు కొన్ని కోతులు అటుగా వెళుతూ ఉంటాయి.

ఇలా వచ్చిన కోతి గుంపులో కోతి పిల్ల వారి గుంపు నుండి బయటికి వచ్చి పంది పిల్లల గుంపు లోకి కలిసిపోయింది.ఇక అంతే అప్పటి నుంచి అటుగా కోతులు వెళ్తున్న సరే తిరిగి వాటి వైపు వెళ్ళకుండా పంది పిల్లలతోనే ఉంటూ జీవనం కొనసాగిస్తోంది ఆ కోతి పిల్ల.

ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube