వంటలక్క నివాసం ఉండే ఇల్లు ఇదే.. ఇంద్రభవనం కాకపోయినా?

కార్తీకదీపం సీరియల్ తో తెలుగు సీరియల్ హీరోయిన్లను మించి పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తున్న హీరోయిన్లలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ప్రేమీ విశ్వనాథ్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

 Monitha New Video On Vantalakka Home Tour Videos Goes Viral In Social Media, Goe-TeluguStop.com

ఈ సీరియల్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ సీరియల్ ను సాగదీస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా సీరియల్ కు ఆదరణ అయితే తగ్గడం లేదు.

బుల్లితెర ప్రేక్షకులు సైతం వంటలక్క పేరు వింటే సంతోషిస్తున్నారు.

వంటలక్క పాత్ర గురించి సోషల్ మీడియాలో సైతం మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న మోనిత వంటలక్క హోమ్ ను చూపించారు.

అయితే ఈ ఇల్లు వంటలక్క నివశించే ఇల్లు కాదు.కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క శ్రీరామ్ నగర్ బస్తీలో ఉంటారనే సంగతి తెలిసిందే.

మోనిత చూపించడంతో ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మోనిత, వంటలక్క సీరియల్ లో బద్ధ శత్రువులు అయినప్పటికీ నిజ జీవితంలో మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.తాజాగా మోనిత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించగా కార్తీకదీపం సీరియల్ కు సంబంధించిన ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు.వంటలక్క హోమ్ టూర్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అయింది.

వంటలక్క ఉన్న ఇల్లు ఇంద్రభవనం కాకపోయినా బాగానే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మోనిత షేర్ చేసిన ఈ వీడియోకు రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్ వస్తుండటం గమనార్హం.ఈ వీడియో నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది.1,000 ఎపిసోడ్లు దాటిన ఈ సీరియల్ 2,000 ఎపిసోడ్ల వరకు ప్రసారం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.ఈ సీరియల్ కు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube