కార్తీకదీపంలో రీఎంట్రీ ఇచ్చిన మోనిత మళ్ళీ వెళ్లిపోనుందా.. బయటపడ్డ నిజం?

కార్తీకదీపం సీరియల్ అనగానే ఆ సమయంలో ఏ పనులున్న వదిలేసుకొని మరి ఆడవాళ్లంతా వచ్చి టీవీల ముందు వాలుతుంటారు.ఎందుకంటే ఆ సీరియల్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అంతగా కనెక్ట్ చేసుకుంది కాబట్టి.

 Monita,re-entry In Kartikdeepam Quits Again,monitha,shobha Shetty,karthika Deep-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఒకటే కాన్సెప్ట్ తో కొనసాగుతుంది.ఇక ఇందులో నటించిన నటీనటులు మాత్రం తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం పెంచుకున్నారు.

ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే ఈ మూడు పాత్రలు చాలా స్ట్రాంగ్ పాత్రలు.ఇక ఈ మూడు పాత్రలో నటిస్తున్న నటులు ఈ సీరియల్ ద్వారా మంచి అభిమానం పెంచుకున్నారు.

ఇక విలన్ పాత్రలో నటిస్తున్న మోనితను కూడా బాగా ఇష్టపడతారు ప్రేక్షకులు.అయితే ఇదంతా పక్కన పెడితే మోనిత ఇటీవలే రీఎంట్రీ ఇవ్వగా మళ్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.


Telugu Babu, Karthika Deepam, Monita, Monitha, Shobha Shetty, Vantalakka-Movie

మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడకు చెందిన ముద్దుగుమ్మ.తొలిసారిగా కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారానే కెరీర్ ప్రారంభించింది.

ప్రస్తుతం తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో పాటు మరో సీరియల్ లో కూడా బిజీగా ఉంది.ఇక ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు కార్తీకదీపం తోనే అందుకుంది.

పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.


సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంటుంది.

ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించగా ఆ సీరీస్ బాగా ఆకట్టుకుంది.అయితే గతంలో కార్తీకదీపం సీరియల్ లో తన పాత్ర ముగిసే సమయం కూడా దగ్గరికి రావడంతో  ఆ విషయాన్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

దీంతో చాలామంది తన అభిమానులు చాలా ఫీల్ అయ్యారు.కానీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.

Telugu Babu, Karthika Deepam, Monita, Monitha, Shobha Shetty, Vantalakka-Movie

అయితే తాజాగా ఈమె మళ్లీ వెళ్లిపోనున్నట్లు తెలుస్తుంది.మామూలుగా శోభ శెట్టి తను మేకప్ వేసుకునే వీడియోలను, చిన్నచిన్న క్లిప్పులను బాగా పంచుకుంటూ ఉంటుంది.అయితే తాజాగా తను మేకప్ వేసుకుంటున్న వీడియో షేర్ చేయగా.అందులో తన పక్కనున్న వాళ్ళతో కలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటూ వీడియో తీస్తూ కనిపించగా అక్కడున్న ఒక వ్యక్తి బాయ్ ఫ్రెండ్స్.2 డేస్ తర్వాత అని అనటంతో పక్కనే ఉన్న శోభ శెట్టి నవ్వింది.అయితే ఈ వీడియో చూసిన వాళ్లంతా నిజంగా శోభ శెట్టి వెళ్ళిపోతుందా.

ఇక తను కార్తీకదీపం సీరియల్ లో కనిపించదా అని అనుమానం పడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube