డాక్టర్ బాబు తమ్ముడితో మోనిత రొమాన్స్... బుజ్జి బంగారం వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో అత్యధిక ప్రేక్షకాదరణ దక్కించుకుని టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ప్రేక్షకాదరణ ఉంది.

 Monitha Romance With Dr Babu Young Brother Video Goes Viral Details,  Monitha, K-TeluguStop.com

ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించే దీప, కార్తీక్, మోనిత(శోభా శెట్టి) పాత్రలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు.ఇకపోతే ఈ సీరియల్ లో తమ్ముని పాత్రలో ఆదిత్య (యశ్వంత్)నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సీరియల్ లో మోనిత కార్తీక్ కోసం అతనిని దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.కానీ నిజ జీవితంలో మాత్రం కార్తీక్ తమ్ముడి పాత్రలో నటిస్తున్న ఆదిత్య (యశ్వంత్) చుట్టూ శోభా శెట్టి తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

మోనిత కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఈ వీడియోలలో ఎక్కువగా ఆదిత్య కనిపించడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున పుకార్లు సృష్టిస్తున్నారు.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినబడుతున్నాయి.

ఇదిలా ఉండగా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా రచ్చ చేస్తున్న వీరిద్దరూ ఒక బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తోంది.నూతన సంవత్సరం కానుకగా యశ్వంత్ శోభా శెట్టి ఒక సినిమా అవకాశాన్ని దక్కించుకున్నట్లు స్వయంగా ఈ విషయాన్ని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.వీరిద్దరూ కలిసి బుజ్జి బంగారం అనే సినిమాలో నటించబోతున్నారని ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముఖ్యంగా ఈ పోస్టర్ లో శోభా శెట్టి ఏకంగా యశ్వంత్ పై వీరిద్దరి మధ్య ఎంతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండబోతోందని నెటిజన్లు భావిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు పోస్టర్ పై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్ చేస్తూ మరిదితో ఈ వ్యవహారం ఏంటి మోనిత అంటూ కామెంట్లు చేయగా.మరికొందరు వరుసకు వదిన అవుతుంది కదా ఆదిత్య? అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరైతే ఏకంగా కార్తీక్ ను వదిలేసి ఆదిత్యను పట్టుకున్నావా అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.బుల్లి తెరపై తన నట విశ్వరూపం తో అందరినీ మెప్పించిన శోభా శెట్టి ఈ ప్రాజెక్టు ద్వారా అందరినీ ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube