టెక్నాలజీ: ఇకనుంచి వాచ్ బెల్ట్ తోనే మనీ ట్రాన్సక్షన్స్..!

మన టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో మాటల్లో చెప్పలేము.ఎప్పటికప్పుడు సైన్స్ టెక్నాలజీ ఏదో ఒక విషయాన్నీ ఆవిష్కరిస్తూ వస్తూనే ఉంది.

 Money Transactions With Watch Belt From Now On . Smart Watch, Payments, Technol-TeluguStop.com

ఈ క్రమంలోనే మరొక కొత్త ఆవిష్కరణకు తెరలేపింది.ఫోన్ల రంగంలో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో బాగా పాపులర్ అయిన షియోమీ కంపనీ మరొక సరికొత్త టెక్నాలజీతో మనముందుకు రానుంది.

అదేంటంటే కాంటాక్ట్‌ లేస్‌ పేమెంట్స్‌ అనే నూతన విధానంను మన ముందుకు తీసుకురానుంది.ఇప్పటివరకు మనం ఏదన్నా ప్రెమెంట్స్ ను కేవలం మొబైల్ ఫోన్లలో మాత్రమే చేసేవాళ్ళము.

కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ తో కూడా పేమెంట్స్ చేయవచ్చు అన్నమాట.

ఈ ఆధునిక టెక్నాలజీతో స్మార్ట్‌ వాచ్‌ బెల్ట్‌ ను ఒక స్ట్రాప్ సహయంతో లావాదేవీలను జరిపే విధంగా సరికొత్త స్మార్ట్ వాచ్ ను త్వరలోనే మనముందుకు తీసుకురానుంది షివోమి కంపనీ.

ఎవరయితే ఎలిజిబుల్ మర్చంట్స్‌ ఉన్నారో వారికి కాంటాక్ట్ లెస్ పద్దతిలో ట్రాన్సాక్షన్లు చేయొచ్చట.ఈ క్రమంలోనే చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రఘురెడ్డి ఈ కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్స్‌ టెక్నాలజీని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో భాగంగా నమోదు చేసినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Telugu Latest, Smart Watch, Ups, Xiaomi-Latest News - Telugu

ఈ స్మార్ట్‌వాచ్ లు ఎన్‌ఎఫ్‌సీ లావాదేవీల్లో భాగంగా షియోమీ పార్టనర్స్‌ తో భాగస్వాములైన రూపే, ఆర్‌బీఎల్‌, జెటాతో పాటు పనిచేయనున్నట్లు తెలుస్తుంది.ఈ స్ట్రాప్‌ ను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు రఘు ట్విటర్‌ ద్వారా తెలిపారు.అంతేకాకుండా ఈ వాచ్ ను ఉపయోగించి పే మెంట్స్ తో పాటు ఒకసారి ఛార్జింగ్ పెడితే చాలు సింగిల్ 14 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ అలాగే ఉంటుందట.మరికొద్ది రోజుల్లో ఈ వాచ్ ను షివోమి కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube