కురిసిన నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా కురిసే రాళ్ల వర్షం, కప్పల వర్షం గురించి మనం విన్నాం.కానీ మాటవరసకు అనే నోట్ల వర్షం నిజంగా కురవడంతో అక్కడి జనం నోరెళ్లబెట్టిన ఘటన తాజాగా వెలుగు చూసింది.

 Money Thrown From Building In Kolkata-TeluguStop.com

ఈ ఘటన కోల్‌కతా నగరంలో జరగడంతో అక్కడి ప్రజలు సంతోషంతో నోట్లను ఏరుకునే పనిలో పడ్డారు.

కోల్‌కతాలోని బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ వాణిజ్య కార్యాలయంపై డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

దీంతో సదరు కార్యాలయంలోని అధికారులు రెండు వేల రూపాయల నోట్ల బండిళ్లను కిటికీ నుంచి బయటకు విసిరేశారు.ఆరు అంతస్థుల పై నుండి నోట్లు కిందకు పడటంతో అవి చెల్లాచెదురుగా పడ్డాయి.

దానిగుండా వెళ్తున్న జనం నోట్ల వర్షాన్ని చూసి అవాక్కయ్యారు.వెంటనే వారికి దొరికిన నోట్లను తమ జేబుల్లో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఈ తతంగాన్ని మొత్తం అక్కడ ఉన్న ఓ షాపు యజమాని ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

నోట్ల వర్షం ఎక్కడ కురిసిందా అంటూ జనం ఆసక్తిగా ఆ వీడియోను తిలకిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube