చెట్లకు డబ్బులు కాయటం ఎప్పుడైనా చూశారా..?! అయితే మీరు ఇది చూడాల్సిందే..!

మనలో చాలామంది ఎప్పుడో ఒక సమయంలో మన స్నేహితులతో గాని బంధువులతో గాని మన ఇంటి వారితో కానీ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తయా అని అనే ఉంటాము.అయితే చెట్లకు పూలు, కాయలు, పండ్లు పూయడం మామూలే.

 Mystery Behind Money Trees In Engalnd, England, Coins, Money Trees, Money Making-TeluguStop.com

మరి చెట్లకు డబ్బులు వస్తే ఎలా ఉంటుందో కదా.? అవును.ఆ ఊరిలో మాత్రమే నిజంగా డబ్బులు చెట్లకు కాస్తున్నాయి.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఇంగ్లాండ్ దేశంలోని వుడ్ ల్యాండ్ లో అనేక చోట్ల నాణేలతో నిండిన వృక్షాలు మనకు కనబడతాయి.ముందుగా ఈ చెట్ల గురించి ఎవరికి అవగాహన లేకుండా వాటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే.

దీనికి కారణం లేకపోలేదు.ఎందుకంటే.

చెట్టు బెరడులో ఏకంగా కొన్ని వేలాది నాణేలు అతుక్కొని ఉంటాయి.నిజంగా వాటిని చూస్తే ఆ చెట్టు నుండి పొడుచుకొని వచ్చినట్టు అచ్చంగా చెట్టుకు కాసినట్టు కనిపిస్తాయి.

అందుకే వీటిని ఆ ప్రాంతంలో మనీ ట్రీ అని పిలుస్తుంటారు.అయితే ఈ చెట్ల నుంచి పుట్టుకు రాలేదు.

దీనికి ఒక కథ ఉంది అది ఏంటంటే.

ఇదివరకు ఇంగ్లాండ్ పూర్వీకులకు కొన్ని నమ్మకాలు ఉండేటివి.

అవేంటంటే.వాడే నాణాలని చెట్ల బెరెడుల్లో కుచ్చుతే వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని అప్పటి ప్రజలు బాగా నమ్మే వాళ్ళు.

దీంతో ఆ కాలంలో ఉన్న ప్రజలు కొన్ని నాణేలను చెట్ల బెరెడు లోకి బలంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవారు.దాంతో ఆ చెట్లకు నాణెం అచ్చం చెట్లకు కాసిన వాటిలాగా కనపడుతున్నాయి.

మన ఇళ్లలో కేవలం మనీ ప్లాంట్ ఉంటుంది.కానీ, అది పేరుకు మాత్రమే.

అదే ఇంగ్లాండ్ దేశంలో అయితే మనీ ప్లాంట్ కు డబ్బులు కూడా ఉంటాయ్ అండోయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube