రూ.500 కోట్ల స్కామ్‌ చేసినోడు.. భార్య చేతిలో దారుణ హత్య!?  

Money Back Policy Chennai Wife Husband - Telugu 500 Croroes Scam, Arrest, Chennai, Money Back Policy Rocket, Wife Murder Husband

కొందరు చేసిన పాపాలకు న్యాయస్థానం శిక్ష వేయకపోయినా దేవుడు వేస్తుంటాడు.ఇంకా అలానే కొన్ని సంవత్సరాల క్రితం మనీ బ్యాక్ పాలసీ రాకెట్ స్కీమ్‌ పేరుతో తమిళనాడు ప్రజల నుంచి రూ.500 కోట్లు దోచుకున్న ప్రభాకరన్‌ అనే వ్యక్తికి దేవుడు భార్య చేతిలో శిక్ష వేయించాడు.

 Money Back Policy Chennai Wife Husband

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చెన్నైకి చెందిన ప్రభాకరన్‌ అలియాస్‌ క్రిస్టి, సుకన్య భార్యాభర్తలకు ముగ్గురు పిల్లలు.

చెన్నైలో మనీ బ్యాక్‌ పాలసీ రాకెట్‌ కేసులో పోలీసులు భార్య భర్తలను ఇద్దరినీ ఏడాది తేడాతో అరెస్ట్ చేశారు.అయితే భార్య సుకన్య 2018లో విడుదల అవ్వగా భర్త 8 నెలల తర్వాత బెయిల్‌‌పై బయటకు వచ్చాడు.

రూ.500 కోట్ల స్కామ్‌ చేసినోడు.. భార్య చేతిలో దారుణ హత్య-General-Telugu-Telugu Tollywood Photo Image

హైదరాబాద్‌‌కు వచ్చేసి మౌలాలిలోని ఆండాల్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ఇంకా అప్పటి వరకు పిల్లలు ప్రభాకర్ తండ్రి దగ్గర ఉండగా భార్య విడుదల అవ్వగానే భర్త ఎక్కడ ఉన్నడో తెలియక పిల్లలను తీసుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బంధువుల ఇంట్లో ఉంటోంది.

అయితే ప్రభాకర్ హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ఈనెల 18న భర్త వద్దకు వెళ్ళింది.అయితే భర్త ప్రభాకరన్ ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని వెంటనే తిరిగివెళ్ళాలని బెదిరించాడు.

ఈ నేపథ్యంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి.ఇంకా అతనిపై కక్ష పెంచుకున్న సుకన్య ఈ నెల 23న రాత్రి నిద్రపోతున్న సమయంలో అతడి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

అయితే ఈ విషయం పోలీసులకు తెలియగా పోలీసులు సుకన్యను అద్బుపులోకి తీసుకొని విచారించగా ఆమె చంపినట్టు అంగీకరించింది.దీంతో ఆమెను రిమాండ్ కు తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Money Back Policy Chennai Wife Husband Related Telugu News,Photos/Pics,Images..

footer-test