ఆనంద్ మహేంద్రాని కదిలించిన వీడియో… సోషల్ మీడియాలో వైరల్  

This Video Served As Monday Motivation For Anand Mahindra, Corona Effect, Lockdown, Village Lifestyle - Telugu Corona Effect, Lockdown, This Video Served As Monday Motivation For Anand Mahindra, Village Lifestyle

కరోనా వైరస్ మొత్తం సమాజాన్ని మార్చేసింది.నిత్యం బిజీ లైఫ్ తో సిటీలలో పరుగులు పెట్టె ప్రజలని మళ్ళీ ఇంటిపట్టునే ఉండేలా చేసింది.

 Monday Motivation Anand Mahindra Village Lifestyle

పల్లెటూళ్ళు వదిలేసి బ్రతుకు తెరువు కోసం పట్టణాలు వెళ్ళిపోయినా ప్రజలని తిరిగి గ్రామాలకి రప్పించింది.అయితే పనులు లేక బ్రతకడానికి కాస్తా కష్టంగా ఉన్న సొంత గ్రామాలలో బ్రతికేంత సంతోషం ఎక్కడా కూడా ఉండదు.

అలాగే స్కూల్స్ కూడా బంద్ కావడంతో పిల్లలు అందరూ ఒకప్పటిలా ఆటలలో మునిగిపోయారు.మొత్తానికి రెండు దశాబ్దాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవనంఎలా ఉండేదో ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపిస్తుంది.

ఆనంద్ మహేంద్రాని కదిలించిన వీడియో… సోషల్ మీడియాలో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిలో సాఫ్ట్ వెర్ ఉద్యోగాలు చేసే వారు కూడా సొంత ఊళ్లలోనే ఉన్నారు.

ఇలాంటి వాతావరణంలో గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులని ఆవిష్కరించే విధంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా ఇలాంటి వీడియోలని మరింత వైరల్ చేయడంలో ముందుంటారు.తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇందులో ఓ గ్రామానికి చెందిన పిల్ల‌లు చెరువులో ఈత కొట్టే విధానం అంద‌రినీ ఉత్సాహ‌ప‌రుస్తుంది.ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా లాక్‌డౌన్‌లో కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ పిల్ల‌లు.

పైగా మ‌ట్టికొండ‌పై నుంచి అలా జారుతుంటే వారి ముఖంలోని హావ‌భావాలు మ‌న‌సుకి హాయినిస్తుంది.ఈ వీడియోను నాంది ఫౌండేష‌న్ సీఈఓ మ‌నోజ్ కుమార్ ట్విట‌ర్‌లో షేర్ చేస్తే దానికి ఆనంద్ మ‌హీంద్రా సోమ‌వారం ప్రేర‌ణ అంటూ రీట్వీట్ చేశారు.

క‌రోనా అనంత‌రం మ‌న‌మంద‌రం ప్ర‌తీ ఆనందానికి ఎక్కువ విలువ‌నిస్తాం.ఈ వీడియో సోమ‌వారం మూడ్‌ను మార్చేస్తుంది.అనే క్యాప్ష‌న్‌తో ఆనంద్ షేర్ చేశారు.

#Lockdown #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monday Motivation Anand Mahindra Village Lifestyle Related Telugu News,Photos/Pics,Images..