బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?  

monal will eliminate in bigg boss 7th week elimination, Bigg boss 7th week elimination, Bigg Boss4, nagarjuna, Eliminations, Monal Romance, Abhijeet, akhil, Divi - Telugu Abhijeet, Akhil, Bigg Boss 7th Week Elimination, Bigg Boss4, Divi, Eliminations, Monal Gajjar, Monal Romance, Monal Will Eliminate In Bigg Boss 7th Week Elimination, Nagarjuna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే సీజన్ 4 మాత్రం ప్రేక్షకుల అంచలనాలను ఏ మాత్రం అందుకోలేదు.

TeluguStop.com - Monal Will Eliminate Bigg Boss 4 Seventh Week

ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక ఈ షోకు మైనస్ గా మారగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఊహించని సెలబ్రిటీలు ఎలిమినేట్ అవుతూ ఉండటం బిగ్ బాస్ షోకు మైనస్ గా మారింది.గత వారం చాలామంది మోనాల్ ఎలిమినేట్ అవుతుందని భావించినా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు.

అయితే ఈ వారం మాత్రం మోనాల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.మోనాల్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ బిగ్ బాస్ షోకు దూరమవుతున్నారని జరుగుతున్న ప్రచారం బిగ్ బాస్ నిర్వాహకులను టెన్షన్ పెడుతోంది.

TeluguStop.com - బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు ఈ సీజన్ లో రేటింగులు కూడా గొప్పగా లేవు.మరోవైపు ఈ వారం అనధికారికంగా నిర్వహిస్తున్న పోల్స్ అన్నీ మోనాల్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి.

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను ఎలిమినేట్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు.లేకపోతే ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

మరోవైపు మోనాల్ ప్రేమాయణాలు, ఏడుపు, ఎక్స్ పోజింగ్ ప్రేక్షకులకు షోపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి.దీంతో ఈ వారం మోనాల్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడం ఖాయమని తెలుస్తోంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు, గుర్తింపు తెచ్చుకుంది మోనాల్.అయితే ఆ సినిమా తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కాగా బిగ్ బాస్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది.

అయితే మోనాల్ రోజురోజుకు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్న నేపథ్యంలో ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

#Akhil #Bigg Boss4 #BiggBoss #Divi #Monal Gajjar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monal Will Eliminate Bigg Boss 4 Seventh Week Related Telugu News,Photos/Pics,Images..