టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో నాలుగు వారాలు గడిచిపోయాయి.ఇప్పటి వరకు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, యాంకర్ దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ మరియు సుజాత ఎలిమినేట్ అయ్యారు.
ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ ఐదో వారంలోకి అడుగు పెట్టారు.ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో పోయిన వారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి అభిజిత్, మోనాల్ చర్చించుకున్నారు.
ఈ క్రమంలోనే మోనాల్‌కు గట్టిగానే కాస్ల్ పీకాడు అభిజిత్.నీతో మాట్లాడకపోతేనే బెటర్ అంటూ మోనాల్ ముఖం మీదే చెప్పేశాడు అభిజిత్.
ఈ చర్చల అనంతరం బిగ్ బాస్ ఇంట్లో అభిజిత్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.అరియానా స్పెషల్ కేక్ తయారు చేయగా.అభిజిత్ కట్ చేసి అందరికీ తినిపించారు.ఇక ఉదయం అయ్యే సరికి.
మోనాల్‌కి హెల్త్ బాలేదని, సెలైన్లు ఎక్కించినట్లు బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.అయితే ఆరోగ్యం బాగోలేకపోయినా.
మోనాల్ ప్రవర్తన మాత్రం మారకపోవడంతో బిగ్ బాస్ ప్రియులు మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.
మోనాల్‌కు హెల్త్ బాగోకపోవడంతో.నిన్నటి ఎపిసోడ్‌లో ఆమెకు సెలైన్లు ఎక్కించారు.
ఈ క్రమంలోనే మోనాల్ దగ్గరకు వెళ్లి చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు అఖిల్.అయితే మోనాల్ మాత్రం ఎప్పటిలాగే అఖిల్‌ని తనపైకి లాక్కుని గట్టి హగ్ ఇచ్చేసింది.
ఓవైపు ఆరోగ్యం బోగోక సెలైన్లు ఎక్కుతున్నప్పటికీ.అఖిల్‌తో రొమాన్స్ మాత్రం మోనాల్ ఆపడం లేదు.
ఇక గత వారం ఇదంతా నేషనల్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది, నా పరువు తీయొద్దు అంటూ పెద్ద సీన్ చేసిన మోనాల్.తన ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదు.
ఈ క్రమంలోనే మోనాల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా జరగగా.
అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక, అరియానా నామినేట్ అయ్యారు.మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.