ఆ ముద్దుతో ఈవారం కూడా మోనాల్‌ను సేవ్‌ చేస్తారేమో..!

తెలుగు బిగ్‌బాస్‌ లో ఒక అద్బుతంగా మోనాల్‌ నిలిచింది.ఎందుకంటే గత నాలుగు అయిదు వారాలుగా ప్రేక్షకుల మద్దతు లేకుండానే ఆమె హౌస్ లో కొనసాగుతూ వస్తోంది.

 Monal Kisses Akhil In Bigg Boss House, Monal, Bigg Boss4, Akhil Birthday, Viral,-TeluguStop.com

ఆమెకు ప్రేక్షకుల నుండి ఎలాంటి మద్దుతు లేకున్నా ఓట్లు పడకున్నా కూడా కొనసాగడం నిజంగా చాలా అద్బుతం అనవచ్చు కదా.అందుకే మోనాల్‌ ను ఒక అద్బుతంగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.తెలుగు బిగ్‌బాస్‌లో ప్రత్యేక ఆకర్షణగా మొదట్లో మోనాల్‌ నిలిచింది.అయితే ఆ తర్వాత తర్వాత పరిణామాలు మారడంతో ఆమె మెల్ల మెల్లగా నెగటివిటీని పెంచుకుంది.

Telugu Akhil Monal, Akhil, Bigg Boss Show, Bigg Boss, Monal-Movie

ఊరికే ఏడవడంతో పాటు ఎక్కుగా అఖిల్‌తో ఉండటం వల్ల ఆమెను జనాలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.ఇదే సమయంలో ఆమె టాస్క్‌ల్లో ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరిగా చేసింది లేదు.అయినా కూడా ఆమెను సేవ్‌ చేస్తూ వస్తున్నారు.ఫైటర్స్‌ గా పేరు తెచ్చుకున్న దేవి, కుమార్‌ సాయి మరియు మెహబూబ్‌ వంటి వారు ఎలిమినేట్‌ అయ్యారు.కాని సుజాత కంటే వీక్‌ అయిన మోనాల్‌ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది.ఆమె ఎలా కంటిన్యూ అవుతుంది అనే విషయం ఎవరికి అర్థం అవ్వడం లేదు.

Telugu Akhil Monal, Akhil, Bigg Boss Show, Bigg Boss, Monal-Movie

షో నిర్వాహకులు ఆమెను కంటిన్యూ చేస్తున్నారు అంటూ కాస్త లాజికల్‌గా ఆలోచిస్తే అర్థం అవుతుంది.ఆమె ఎక్కువగా అఖిల్‌తో ఉండటం వల్ల ఫుటేజ్‌ ఎక్కువగా వస్తుంది.ప్రస్తుతం ఈ వారం మోనాల్‌ ఎలిమినేషన్‌లో ఉన్న విషయం తెల్సిందే.ఈ వారం ఆమె వెళ్లి పోతుందని అంతా భావంచారు.కాని నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌కు ఆమె ముద్దు పెట్టడంతో మళ్లీ కెమిస్ట్రీ మొదలు అయినట్లుగా జనాలు అనుకుంటున్నారు.అందుకే బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ఆమెను మరో వారం కంటిన్యూ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube