బిగ్‌బాస్ షోలో తొలి రోజే నాగ్ చాలా ఫిటింగ్‌లు పెట్టేశాడు.తొలి రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లను లోపలకు అలా పంపాడో లేదో వెంటనే రేపు తొలినామినేషన్కు కంటెస్టెంట్లు రెడీగా ఉండాలని చెప్పాడు.
దీంతో హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు అలా కుదురుకోకుండానే వెంటనే వారి నెత్తిపై నామినేషన్ పిడుగు పడింది.ఇక హౌస్‌లోకి ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తోన్న వేళ వారి పర్సనల్ లైఫ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి.
ఇదిలా ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం అభిజిత్‌ను నాగ్ భలే ఇరికించేశాడు.
అభిజిత్‌కు ముందు మూడు ఫొటోలు పెట్టి వీరిలో ఎవరిని పెళ్లాడతావు ? ఎవరితో డేట్‌కు వెళతావు ? ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ? అని అడిగాడు. దీనికి అభిజిత్ స్పందిస్తూ పూజా హెగ్డేను పెళ్లి చేసుకుని.తమన్నాను ముద్దు పెట్టుకుని.కాజల్ అగర్వాల్‌తో డేట్ చేస్తానని చెప్పాడు.సో అలా బుట్టబొమ్మ పూజా హెగ్డేపై మనోడు మనసు పారేసుకున్నాడు.
పూజ బిగ్‌బాస్ హౌస్‌లో లేదు కాబట్టి సరిపోయింది.అయితే ఈ సారి నాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఫొటోతో పాటు రాశీఖన్నా, నభా నటేష్ ఫొటోలు పెట్టి మళ్లీ టెస్ట్ చేశాడు.
అభిజిత్ ఈ ముగ్గురిలో మోనాల్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.మోనాల్ గజ్జర్ ట్రెడిషనల్‌గా ఉందని తనకు నచ్చిందని చెప్పాడు.ఇక రాశీఖన్నాతో డేట్ చేస్తానని.నభా నటేష్‌ను ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు.
ఇక తాను పెళ్లిగోల వెబ్‌సీరిస్‌లో నటించానని చెప్పగా మరి నీ పెళ్లి ఎప్పుడు అని నాగార్జున అడిగిన వెంటనే మీరు ఆ మాట ఎత్తొద్దు సార్.మా వాళ్లు నన్ను ఇప్పటికే పెళ్లి చేసుకోమంటూ ఎత్తిపోస్తున్నారు.
బిగ్‌బాస్ కి వెళుతున్నావు ? అక్కడ ఎవరిని అయినా చూసుకొచ్చేయరా అన్నారని కూడా సరదాగా చెప్పాడు.ఏదేమైనా నాగార్జున మొత్తానికి అభిజిత్‌కు భలే ఫిటింగ్ పెట్టేశాడనే చెప్పాలి.