వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల తెలుగులో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే.బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టగా.
మొదటి వారం దర్శకుడు సూర్య కిరణ్ బ్యాగ్ సద్దేశారు.అయితే అదే సమయంలో మరో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
వారిలో ఒకరు జబర్దస్త్ అవినాష్.బిగ్ బాస్ షో మొదలైన 12 రోజుల తర్వాత అవినాష్ జోకర్ వేషంతో ఇంట్లోకి అడుగు పెట్టారు.
ఇక అవినాష్ వచ్చి రావడంతోనే బిగ్ బాస్ హౌస్‌లో తనదైన కామెడీతో ఫుల్ సందడి చేయడంతో పాటు.మోనాల్ గజ్జర్‌తో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.మొదటి రోజే మోనాల్ దగ్గరకు వెళ్లి.నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది.
నేను నీకు పెద్ద ఫ్యాన్.నా గురించి ఆలోచించు అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ సోప్ వేసేందుకు ట్రై చేశారు.
అయితే రెండో రోజు అవినాష్ అందరినీ నవ్వించేందుకు మోనాల్ ఎలా ప్రవర్తిస్తుందో చేసి చూపించారు.దీంతో మోనాల్‌కు మండిపోయింది.ఈ క్రమంలోనే అవినాష్‌పై ఫైర్ అయ్యింది మోనాల్.అందరూ రిక్వెస్ట్ చేస్తేనే తాను అలా చేశానని అవినాష్ చెబుతున్నా.
అవేమీ మోనాల్ పట్టించుకోలేదు.మళ్లీ మళ్లీ నా పేరు ఎందుకు తీస్తున్నావ్.
నాకు బాగా కోపం వచ్చిందని చెప్పుకొచ్చింది. ఒక్కసారి పిలిస్తే కామెడీ అనుకోవచ్చు.
పదే పదే ఇలా చేస్తే బాగోదు అంటూ అవినాష్‌కు మోనాల్ వార్నింగ్ ఇచ్చింది.దీంతో అవినాష్ ఫీల్ అయ్యి.
మోనాల్‌కు సారీ చెప్పి వెళ్లిపోయాడు.మరి ఇప్పటినుంచైనా అవినాష్ పులిహోర కలపడం మానేస్తాడా.
లేదా.అన్నది చూడాలి.
కాగా, లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిన అవినాష్.హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారతాడు అనడంలో సందేహమే లేదు.
ఇక జబర్దస్త్ టీం లీడర్ కావడంతో అవినాష్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.