ఓంకార్ కాళ్ళు మొక్కి.. కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్ గజ్జర్..?

తెలుగు సినీ నటి మోనాల్ గజ్జర్ కంటే బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ అంటేనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపడతారు.ఎందుకంటే బిగ్ బాస్ తర్వాతనే మరింత గుర్తింపు అందుకుంది.

 Monal Gajjar Touches Host Omkar Feet At Dance Plus Show Finale, Omkar, Dance Plu-TeluguStop.com

అంతేకాకుండా మరో కంటెస్టెంట్స్ అఖిల్, అభిజిత్ తో కలిసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో మరింత ఫేమస్ గా మారింది.ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెరలో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ.

బిగ్ బాస్ కంటే ముందు వెండితెర లో నటించిన మోనాల్ అంత సక్సెస్ ను అందుకోలేదు.కానీ బిగ్ బాస్ తర్వాత మంచి ఫాలోయింగ్ అందుకుంది.అంతేకాకుండా వెండితెర పై స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.ఇదిలా ఉంటే బుల్లితెరలో ఇటీవల ముగిసిన డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇందులో మోనాల్ తన ఎంట్రీ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకునేది.

ఇందులో ఓంకార్ యాంకరింగ్ చేస్తూ ఈ సీజన్ ను మంచి సక్సెస్ తో పూర్తి చేశాడు.

ఇక ఈ సందర్భంగా మోనాల్ కు మర్చిపోలేని గిఫ్ట్ ను అందించాడు ఓంకార్.ఇక ఆ గిఫ్ట్ చూశాక మోనాల్ తోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.

ఆ గిఫ్టు లో మోనాల్ తన తండ్రితో ఉన్న ఫోటో ఉంది.ఇక ఆ ఫోటో చూసి అక్కడే బాగా ఏడ్చింది మోనాల్.

తనకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని.తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయారని ఈ షోలో తెలిపింది.

Telugu Dance Finale, Monal, Monal Gajjar, Omkar, Sekhar Master, Touches-Movie

అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యేది మోనాల్.ఇక తన దగ్గర ఉన్న ఒక ఫోటోను చూపించి ఇదే నా వద్ద ఉన్న ఏకైక ఫోటో అంటూ తెలిపింది.ఇక తను ఈ షోలో పంచుకున్న వీడియో ను బెంగళూరు పెయింటర్ దీపక్ అనే వ్యక్తి చూసి తన మాటలకు భావోద్వేగానికి గురై తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే పెయింటింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట.

ఇక అతడు ఓంకార్ ను సంప్రదించగా మొత్తానికి ఆ ఫోటో ని వేశారు.

Telugu Dance Finale, Monal, Monal Gajjar, Omkar, Sekhar Master, Touches-Movie

ఇక ఆ ఫోటో ను ప్రోగ్రాం ఫినాలే రోజు మోనాల్ కు గిఫ్ట్ గా అందించి మోనాల్ ను షాక్ అయ్యేలా చేశారు.అంతేకాకుండా ఎంతో భావోద్వేగానికి కూడా గురైంది ఈ బ్యూటీ.ఇక ఈ పెయింటింగ్ గిఫ్ట్ ను అందించిన దీపక్ కు థాంక్స్ చెప్పుకుంది మోనాల్.ఇక అంతే కాకుండా తనకు అద్భుతమైన గిఫ్ట్ ను అందించినందుకు ఓంకార్ ను చూసి ఎమోషన్ అవుతూ తన కాళ్లకు నమస్కరించింది.

వెంటనే ఓంకార్ తనను లేపి తలపై చేతితో నిమిరి భావోద్వేగానికి గురయ్యారు.

ఇక ఓంకార్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇస్తూ.

ఆయన ఎంత చక్కగా ఉన్నారో చూడండి అంటూ కామెంట్ చేశాడు.ఇక తనకు అతి పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చింది మోనాల్.

ఇక చివర్లో శేఖర్ మాస్టర్ మోనాల్ నవ్విన, ఏడ్చిన అందంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube