బిగ్ బాస్ గుట్టు విప్పిన మోనాల్.. అవాక్కైన ఫ్యాన్స్..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తై చాలా రోజులే అయినా సీజన్ 4 కంటెస్టెంట్లు ఇస్తున్న ఇంటర్వూల వల్ల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 లో దత్తపుత్రికగా పేరు తెచ్చుకున్న మోనాల్ ఏకంగా 14 వారాల పాటు హౌస్ లో ఉండటంతో పాటు చివరి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.

 Monal Gajjar Sensational Comments About Bigg Boss Show, Bigg Boss Season 4, Mona-TeluguStop.com

బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమెకు ఉన్న ఒప్పందం వల్లే మోనాల్ అన్ని వారాల పాటు హౌస్ లో ఉందని జోరుగా ప్రచారం జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గ్లామర్ షో గురించి కూడా ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఒక ఇంటర్వ్యూలో మోనాల్ కు బిగ్ బాస్ హౌస్ లో డ్రెస్సింగ్ కు సంబందించిన ప్రశ్నలు ఎదురు కాగా ఎలాంటి బట్టలు వేసుకోవాలో తనకు తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ రోజున హారిక వేసుకున్న షార్ట్ డ్రెస్ మొదట తనకు ఇచ్చారని కానీ తాను వేసుకోనని చెప్పానని పేర్కొన్నారు.

Telugu Bigg Boss, Monal Gajjar-Latest News - Telugu

తన శరీరానికి ఎలాంటి డ్రెస్సులు బాగా నప్పుతాయో అలాంటి డ్రెస్సులు మాత్రమే వేసుకుంటానని మోనాల్ పేర్కొన్నారు.ఇతరుల అభిప్రాయాలను తాను పట్టించుకోనని.తనకు కంఫర్ట్ ముఖ్యమని ఆమె అన్నారు.తన బట్టల గురించి విమర్శలు చేసేవాళ్లకు తాను ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.మరోవైపు బిగ్ బాస్ షో వల్ల మోనాల్ కు టీవీలలో, సినిమాలలో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల ఆఫర్లు బాగానే వస్తున్నా ప్రస్తుతం మోనాల్ చేస్తున్న సినిమాలు, షోలు సక్సెస్ అయితే మాత్రమే కెరీర్ లో వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.

మరి సెకండ్ ఇన్నింగ్స్ లో మోనాల్ సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.మోనాల్ బిగ్ బాస్ వాళ్లే షార్ట్ డ్రెస్ ఇచ్చారని బిగ్ బాస్ గుట్టు విప్పడంతో ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube